గ‌ప్‌చుప్‌గా డైరెక్ట‌ర్‌తో స్వాతి రెండో పెళ్లి.. ఫొటోలు వైర‌ల్‌!

admin
Published by Admin — July 08, 2026 in Movies
News Image

బుల్లితెరపై ‘కలర్స్’ షోతో తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది స్వాతి రెడ్డి. ఆ తర్వాత వెండితెరపై హీరోయిన్‌గా మారి తనదైన నటనతో ‘కలర్స్ స్వాతి(Colors Swathi)’గా టాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగింది. అయితే, కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే 2018లో వికాస్ అనే పైలట్‌ను ప్రేమ వివాహం చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. కేరళలో సెటిలైపోయిన ఈ బ్యూటీ, కొన్నాళ్లకే భర్తతో విభేదాల వల్ల వార్తల్లో నిలిచింది.

విడాకుల రూమర్స్ నడుస్తున్న వేళ.. స్వాతి ‘మంత్ ఆఫ్ మధు(Month of Madhu)’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆ సినిమా ప్రమోషన్స్ సమయంలో వ్యక్తిగత జీవితంపై వచ్చిన ప్రశ్నలను ఆమె సున్నితంగా దాటవేసింది. కానీ, ఇప్పుడు అందరికీ ఊహించని షాక్ ఇస్తూ, ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా రెండో పెళ్లి పీటలెక్కింది ఈ ముద్దుగుమ్మ.

ట్విస్ట్ ఏంటంటే.. తను రీఎంట్రీ ఇచ్చిన ‘మంత్ ఆఫ్ మధు’ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ నాగోతి(Srikanth Nagothi)తోనే స్వాతి ప్రేమలో పడింది. తాజాగా ఈ దర్శకుడిని వివాహం చేసుకున్నట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. "పెళ్లి చేసుకున్నాం" అంటూ శ్రీకాంత్‌ను ట్యాగ్ చేస్తూ స్వాతి షేర్ చేసిన వెడ్డింగ్ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. నెటిజన్లు, సెలబ్రిటీలు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రేజీ స్టెప్‌తో.. తమను డైరెక్ట్ చేసిన దర్శకులనే మనసు పారేసుకుని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్ల లిస్టులో కలర్స్ స్వాతి కూడా చేరిపోయింది.

Tags
Srikanth Nagothi Colors Swathi Actress Swathi Month Of Madhu Tollywood Colors Swathi Marriage
Recent Comments
Leave a Comment

Related News