మెల్బోర్న్ లో ఏపీఎన్నార్టీ కోఆర్డినేటర్ల సమావేశం

admin
Published by Admin — July 12, 2026 in Nri
News Image

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నూతనంగా నియమించిన ఏపీఎన్‌ఆర్‌టీ (APNRT) కో-ఆర్డినేటర్ల సమావేశం మెల్బోర్న్‌లో అత్యంత ఆత్మీయ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కో-ఆర్డినేటర్లందరూ ప్రత్యేకంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పదవులు పొందిన ప్రతినిధులందరినీ శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది.

తమకు కో-ఆర్డినేటర్లుగా సేవలందించే బాధ్యతలు అప్పగించి, తగిన గుర్తింపునిచ్చినందుకు ఈ సందర్భంగా వారందరూ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ ప్రవాసాంధ్రుల సమావేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ఎన్‌ఆర్‌ఐల (NRI) తరపున ఏ విధంగా పూర్తిస్థాయి మద్దతు అందించాలనే పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్‌ఆర్‌ఐలు క్రియాశీలక భాగస్వాములు కావాలని, ప్రభుత్వం చేపడుతున్న ప్రజా ఉపయోగ కార్యక్రమాలను ప్రవాసాంధ్రుల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. నూతన బాధ్యతలు స్వీకరించిన కో-ఆర్డినేటర్లు అందరూ రాష్ట్ర ప్రగతికి తమ వంతు శాయశక్తులా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

ఈ విజయవంతమైన కార్యక్రమంలో ఏపీఎన్‌ఆర్‌టీ రీజినల్ కో-ఆర్డినేటర్ లగడపాటి సుబ్బారావు, ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ సభ్యులు నర్మదా జొన్నలగడ్డ, గోపి నంబళ్లతో పాటు కో-ఆర్డినేటర్లు సుమా తాటినేని, కిషోర్ బలుసు, బాల పసుపులేటి మరియు ఇతర కో-ఆర్డినేటర్లు, ప్రవాసాంధ్ర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags
Apnrt coordinators meeting held in Melbourne
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News

Latest News