పులివెందుల ఎమ్మెల్యే జగన్ పై టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ షాకింగ్ కామెంట్లు చేశారు. బాబాయి వివేకాను అబ్బాయి జగన్ చంపించాడంటూ లోకేశ్ చేసిన కామెంట్లు పెను ప్రకంపనలు రేపుతున్నాయి. కడపలో యువగళం పాదయాత్ర సమయంలోనే తాను ఈ విషయం చెప్పానని లోకేశ్ గుర్తు చేసుకున్నారు. సొంత బాబాయ్ ను జగన్ లేపేసి తప్పు కాదని బుకాయిస్తున్నాడని లోకేశ్ విమర్శించారు.
జగన్ కారు కింద పడి సింగయ్య చనిపోయాడని, ఆయనే చంపేసినా అది తప్పుకాదని చెబుతున్నాడని జగన్ ను ఏకిపారేశారు. సీదిరి అప్పలరాజు కొడుకు ఒక వ్యక్తిని గుద్ది చంపేస్తే తప్పు కాదని జగన్ అంటున్నారని లోకేశ్ విమర్శించారు. ఈ సమాజంలో మనం ఎక్కడికి పోతున్నాం అని ఆయన ప్రశ్నించారు. ఇక, జగన్ కు ఆత్మలతో మాట్లాడే అలవాటుందని, ఒక్కోరోజు ఒక్కో ఆత్మతో ఆయన మాట్లాడుతుంటారని సెటైర్లు వేశారు. ఒకరోజు మావిగన్ అని, మరో రోజు బెంటాహై..బెంగుళూరు, తాడేపల్లి, హైదరాబాద్ అంటాడని జగన్ గాలి తీశారు లోకేశ్.
వైసీపీ నేతల ధోరణి వల్లే అమరరాజా వంటి పరిశ్రమలు పక్క రాష్ట్రం తెలంగాణకు తరలిపోయాయని లోకేశ్ అన్నారు. అందుకే, అమరరాజా పరిశ్రమ ఏపీకి రావాలని ఆహ్వానిస్తున్నామని, ఏపీలో పుట్టిన ఆ పరిశ్రమకు ఈ రాష్ట్రం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. ఇక, ఆ కంపెనీ ఎండీ, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కు ఆంధ్రప్రదేశ్ రుణపడి ఉంటుందని అన్నారు. వైసీపీ జఫ్యా బ్యాచ్ పట్ల ప్రప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే ఏపీకి వచ్చే పెట్టుబడిదారులు రారని చెప్పారు. పెట్టుబడులు, పరిశ్రమలు రాకుంటే ప్రజలు, నిరుద్యోగ యువత ఇబ్బందిపడతారని చెప్పారు.