మాజీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని సీతారాం గత ప్రభుత్వ హయాంలో నీతి సూక్తులు చెప్పారని, కానీ, ఇప్పుడు నకిలీ డెత్ సర్టిఫికెట్ తో నాలుగు కోట్ల విలువైన భూమిని కొట్టేశారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ్మినేనిపై ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సంచలన ఆరోపణలు చేశారు. స్పీకర్‌గా ఉన్నప్పుడు నీతులు చెప్పిన తమ్మినేని...బతికున్న మనిషి చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించారని మండిపడ్డారు.
రూ. 4 కోట్ల విలువైన భూములను తమ్మినేని కొట్టేశారని ఆరోపించారు. ఆ కబ్జాకు సూత్రధారి తమ్మినేని అని, పాత్రధారి ఆయన కుమారుడేనని ఆరోపించారు. భూములు కావాలనుకుంటే చట్టబద్ధంగా కొనాలని, ఇలా బతికున్న వ్యక్తిని చనిపోయాడని చిత్రీకరించకూడదని ఎద్దేవా చేశారు. సీదిరి అప్పలరాజు తన కుమారుడు చేసిన యాక్సిడెంట్ కేసును పక్కదారి పట్టించారని మండిపడ్డారు. వేరొక అమాయకుడిని ఇరికించేందుకు యత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.