సీజేపీ నేతలు, కార్యకర్తలు, విద్యార్థుల ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుతూనే ఉంది. ఈ రోజు కూడా జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. సీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులపై రాళ్లు, వాటర్ బాటిళ్లతో నిరసనకారులు దాడి చేశారు. అదే సమయంలో నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు.
జంతర్ మంతర్ వద్ద గుమిగూడిన నిరసనకారులు టాల్‌స్టాయ్ మార్గ్ వైపు కదలడంతో ప్రదర్శన హింసాత్మకంగా మారింది. ఒక్కసారిగా పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు, సీసాలతో దాడులకు పాల్పడ్డారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆర్ఏఎఫ్, ఢిల్లీ పోలీసు బృందాలు విధులు నిర్వహిస్తున్నాయి. నిరసనకారులు అకస్మాత్తుగా దాడికి దిగడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది.