ఎస్సీ, ఎస్టీ కేసు.. చిక్కుల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.!

admin
Published by Admin — July 23, 2026 in Politics, Andhra
News Image

వైఎస్సార్‌సీపీ నాయకుడు, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మాజీ శాసనసభ్యుడు జక్కంపూడి రాజా(Jakkampudi Raja) చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. ధర్నా వేదికగా స్థానిక పోలీసు అధికారిని లక్ష్యంగా చేసుకుని చేసిన తీవ్రవ్యాఖ్యలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన కర్నూలు పోలీసులు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు విచారణకు రావాల్సిందిగా అధికారికంగా నోటీసులు పంపారు.

అస‌లేం జ‌రిగిందంటే.. ఇటీవల కర్నూలు వేదికగా నిర్వహించిన ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జక్కంపూడి రాజా, అక్కడి స్థానిక త్రీటౌన్ సీఐ శేషయ్య(CI Sheshaiah)పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సదరు అధికారి భారీగా నిధులతో టికెట్ కోసం ప్రయత్నించారని, అయితే ఆయన అవినీతి నేపథ్యం కారణంగా తాము తిరస్కరించామని రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా, తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే భవిష్యత్తులో అధికారంలోకి వచ్చాక తీవ్ర పరిణామాలు ఉంటాయని, తమ నివాసం ముందు నిలబెట్టి శిక్షిస్తామని బహిరంగంగా హెచ్చరించారు.

మాజీ ఎమ్మెల్యే చేసిన ఈ బహిరంగ ఆరోపణలు, హెచ్చరికలు తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని భావించిన సీఐ శేషయ్య ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు. సదరు సభకు సంబంధించిన డిజిటల్, ఆడియో-వీడియో ఆధారాలను పరిశీలించిన కమిషన్, దీనిని తీవ్రమైన అంశంగా పరిగణించింది. చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో, కర్నూలు(Kurnool) పోలీసులు రాజాపై కేసు నమోదు చేసి, విచారణాధికారి ముందు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. ఈ పరిణామం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లోనూ, పోలీస్ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

Tags
Jakkampudi Raja YSRCP Kurnool Police SCST Case Andhra Pradesh AP Politics CI Sheshaiah AP News
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News