బాల‌య్య కూతురు ఫిల్మ్ ఎంట్రీ.. స్క్రిప్ట్ కూడా లాక్.!

admin
Published by Admin — July 31, 2026 in Movies
News Image

నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వస్తోంది. టాలీవుడ్(Tollywood) బాక్సాఫీస్ వద్ద తనదైన శైలిలో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కుటుంబం నుంచి మరో కొత్త ముఖం వెండితెరకు పరిచయం కాబోతోంది. అయితే అందరూ ఊహించినట్లుగా నందమూరి వారసుడు మోక్షజ్ఞ కంటే ముందే, బాలయ్య గారాల పట్టి తేజస్విని సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఒక డిఫరెంట్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. కేవలం గ్లామర్ పాత్ర కాకుండా, బలమైన భావోద్వేగాలు. సమాజానికి మంచి సందేశం ఉండే ఒక పవర్‌ఫుల్ లీడ్ రోల్‌లో తేజస్విని(Tejaswini) కనిపించబోతున్నారట. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కథా చర్చలు అన్నీ పూర్తయ్యాయని, దర్శకుడు చెప్పిన స్క్రిప్ట్‌కు ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

తేజస్విని(Tejaswini) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తరచూ ఆమె చేసే డ్యాన్స్ రీల్స్, బ్రాండ్ ప్రమోషన్స్, అడ్వర్టైజ్‌మెంట్లు నెట్టింట వైరల్ అవుతుంటాయి. కెమెరా ముందు ఆమె చూపించే స్క్రీన్ ప్రెజెన్స్, ఈస్ చూసిన అభిమానులు "ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తారా?" అని ఎప్పటినుంచో ఆశపడుతున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ కోరుకున్నట్టుగానే ఆమె వెండితెర అరంగేట్రానికి అడుగులు పడుతున్నాయి.

నందమూరి వారసుడు మోక్షజ్ఞ(Mokshagna) ఎంట్రీపై టాలీవుడ్‌లో గతకొన్ని సంవత్సరాలుగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే, ఆయన పూర్తి స్థాయి హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ముందే తేజస్విని హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంద‌నే వార్త‌లు తెర‌పైకి రావ‌డం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే కనుక నిజమైతే, నందమూరి నెక్స్ట్ జనరేషన్ నుంచి సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టిన తొలి మెంబర్‌గా తేజస్విని రికార్డ్ సృష్టిస్తారు.

Tags
Nandamuri Tejaswini Balakrishna Tollywood Nandamuri Family Telugu Cinema NBK
Recent Comments
Leave a Comment

Related News