పరామర్శలకు కూడా అర్ధం పరమార్థం ఉండాలి. లేకపోతే.. గాడితప్పుతాయి. తాజాగా జగన్ చేసిన పరా మర్శ యాత్ర బెడిసి కొట్టింది. మాజీ మంత్రి సిక్కోలు జిల్లాకు చెందిన సీదిరి అప్పలరాజును జైలులో పరా మర్శించేందుకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్‌కు వ్రతమూ చెడింది.. ఫలితమూ దక్కలేదన్న మాట వినిపి స్తోంది. తాజాగా చేపట్టిన ఈ పరామర్శ.. పలు విమర్శలకు కూడా దారితీసింది. మొత్తగా దీనిలో జగన్ సాధించింది ఏమీలేదన్న టాక్ వినిపిస్తోంది.
కట్టుబాటు ఏదీ?
వైసీపీ కేడర్‌లో కట్టుబాటు లేదన్న విషయం మరోసారి స్పష్టమైంది. గత రెండేళ్లుగా పార్టీ కేడర్ ఇదే విమ ర్శ ఎదుర్కొంటోంది. ఒక విధానం.. ప్రణాళిక లేకుండా కేడర్ రోడ్డెక్కడం.. వారిని నడిపించేవారు కూడా దూకుడుగా వ్యవహరించడంతో విమర్శలు మూటగట్టుకునే పరిస్థితి వస్తోంది. ప్రధానంగా రెండు కీలక అంశాలు ఈ పరామర్శ యాత్రను డైల్యూట్ చేశాయన్నది విశ్లేషకులు చెబుతున్నమాట. ఈ రెండు కూడా వైసీపీకి మైనస్ అవుతాయని అంటున్నారు.
1) సమయం-సందర్భం: అసలు సీదిరి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన జగన్.. సమయం, సందర్భం లేకుండా ఎన్నికల ప్రచార యాత్రకు వెళ్లినట్టు వెళ్లడం, బల ప్రదర్శనకు దిగడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ నేతలు.. విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నా రు. నేరుగా జైలుకు వెళ్లి.. అక్కడ సీదిరిని పరామర్శించి ఉంటే.. అక్కడితో జగన్ లక్ష్యం నెరవేరేది. కానీ, అంతర్గతంగా ఆయన బల ప్రదర్శనకు తెరదీసి విమర్శలు మూటగట్టుకున్నారు.
2) కేడర్: విచ్చలవిడి స్వేచ్ఛతో వ్యవహరించిన కేడర్‌ను అదుపు చేసే యంత్రాంగం వైసీపీలో కనిపించ డం లేదు. గతంలో రప్పా-రప్పా డైలాగులతో విరుచుకుపడ్డ యువతను కంట్రోల్ చేసే ప్రయత్నం చేయ లేదు. ఇప్పుడు ఏకంగా మహిళా ఎస్సైని టార్గెట్ చేయడం దీనిలో పరాకాష్ఠ. ఈ పరిణామాలతో వైసీపీ అధినేత చేపట్టిన యాత్ర విఫలం అయిందన్న వాదన వినిపిస్తోంది. సుమారు 9 కిలో మీటర్ల దూరానికి 5 గంటలకు పైగా యాత్ర చేయడం సరికాదని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.