ఇదే భోగాపురం ఎయిర్ పోర్ట్..చంద్రబాబు ఫొటో వైరల్

admin
Published by Admin — August 01, 2026 in Andhra
News Image
ఉత్తరాంధ్ర అభివృద్ధి పథంలో ఈ రోజు నవశకం మొదలైంది. ఉత్తరాంధ్రకు మణిమకుటంగా మారిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఈ రోజు ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రకు కొత్త గేట్ వే ఇది అని చెబుతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు చూపిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అబ్ ఉడేగా ఉత్తరాంధ్ర అన్న రీతిలో చంద్రబాబు ఏఐఎస్ఆర్ విమానాశ్రయం బోర్డువైపు వేలెత్తి చూపుతున్న ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

అంతకుముందు, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబులకు ఉత్తరాంధ్రకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఉత్తరాంధ్రవాసుల కలలకు రెక్కలు వచ్చినట్లేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర విమానయాన శాఖా మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉత్తరాంధ్రకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
News Image
News Image
Tags
Bhogapuram International Airport uttarandhra cm chandrababu pic viral
Recent Comments
Leave a Comment

Related News