తానా- పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం

admin
Published by Admin — August 01, 2026 in Nri
News Image

అమెరికా రాజధాని ప్రాంత పరిధి (వర్జీనియా రాష్ట్రం) లో ప్రవాస భారతీయులు, వారి తల్లిదండ్రుల సమక్షంలో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం కార్యక్రమం జరిగింది. కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసారు. ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈకార్యక్రమాన్ని పాఠశాల చైర్మన్ మాగులూరి భానుప్రకాష్ సమన్వయపరచారు. 

ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ, స్నేహ బంధం అమూల్యం. పెద్దల స్నేహ బంధం ఇలాగే కొనసాగాలి. 60 ల వయసులో నలుగురు ఆప్తులే మనకున్న నిజమైన ఆస్తి. ఈ తరానికి తెలుగు భాషను నేర్పించటంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. తరాల అనుసంధానం మాతృభాషతోనే సాధ్యం. తెలుగు బాష పరిరక్షణ మనందరి విధి. మన తెలుగు మన పిల్ల కోసం అని తెలిపారు.

తానా-పాఠశాల చైర్మన్ భాను మాగులూరి మాట్లాడుతూ మాతృభూమి, మాతృబాష మన రెండు కళ్ళు. వృత్తి, ఉపాధి, వ్యాపార రీత్యా తెలుగు వారు ప్రపంచంలో ఏ దేశంలో నివసిస్తున్నా మనందరి ఉమ్మడి భావ ఐక్య వేదిక మాతృబాష తెలుగు. ఈ తరం చిన్నారులకు తెలుగు భాషను నేర్పించటం ఇంటింటి భాద్యత. భాషే బంధాలకు మూలం. తరాల అంతరాన్ని భాషతో పూరిద్దాం, మన భాద్యతను సగర్వంగా నిర్వహిద్దాం అని అందరికీ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.

పలువురు పెద్దలు మాట్లాడుతూ.. పిల్లల కోసం జీవితకాలం కష్టించి, వారిని ఉన్నత స్థితిలో నిలిపిన నిజజీవిత కథానాయకులు ప్రవాస భారతీయుల తల్లిదండ్రులు. ఆరు నెలలు విడిది కోసం వచ్చినా, తెలుగు వారు స్నేహ బంధాన్ని నెలకొల్పి, ఆ బంధాన్ని ఇండియా లో సైతం కొనసాగిస్తూ వినోదం, తీర్థ యాత్రలు లాంటి కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.

తమ తమ జీవితాలలో స్నేహితుల పాత్ర, కష్ట నష్టాలలో స్నేహం విలువ, ఒకరినొకరు గౌరవిస్తూ జీవితకాలం అండగా నిలిచిన మిత్రులను, సందర్భాలనూ నెమరు వేసుకున్నారు. అందరూ తమ జీవిత స్నేహ అనుభవాలను పంచుకున్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతారామారావు ఎండూరు , శ్రావ్య చామర్తి, శ్రీకాకుల రామ సత్యనారాయణ, వల్లభనేని వీరభద్రరావు, చంద్రనాధ్ నంబూరు, కందుల అభిరామ్, శంకర్రావు పొన్నం, పూర్ణచంద్రరావు అన్నం,కరణం రాజా, అంకమ్మరావు కట్ల, రాధాకృష్ణ మైనేని, సుబ్బారెడ్డి జొన్నల, ఐతా భిక్షపతి, సూరేపల్లి బ్రహ్మం, మేకల రామి రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సి.హెచ్ సత్యనారాయణ, ఆళ్ళ హరిబాబు, చిట్టెల సుబ్బారావు, రామకృష్ణ రెడ్డి, గణపతిరెడ్డి గుడిపాటి , జంపాల కృష్ణ మోహన్, డాక్టర్ అల్లం లింగం, సురేష్ లగిశెట్టి, యోగానంద్ వంకిన, గంగారావు పొనగోటి , సుదర్శన్ అమరవాది, భాస్కరరావు చీటి, సత్తయ్య మారిశెట్టి, గుడిపాటి గణేష్ రెడ్డి, చెరుకూరి ఇందుశేఖర్, షేక్ నూరి, పులిపాటి రాజేంద్ర ప్రసాద్, చింతా రాంబాబు, ప్రభు, పి.నర్సింగ రావు, శ్రీనివాస్ చేరుకుతోట, వెంకటేశ్వర్రావు చెరుగుప్పం, యాదగిరి గుండా తదితరులు పాల్గొన్నారు.

News Image
News Image
News Image
Tags
International friendship day celebrated by TANA-PATASALA in grand style
Recent Comments
Leave a Comment

Related News

Latest News