శభాష్ లోకేశ్...ప్రధాని మోదీ కితాబు

admin
Published by Admin — August 01, 2026 in Andhra
News Image

తండ్రికి తగ్గ తనయుడిగా మంత్రి నారా లోకేశ్ పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ ఆయన రాజకీయ వారసుడిగా దినదిన ప్రవర్థమానమై లోకేశ్ ఎదుగుతున్నారు. ఈ క్రమంలోనే లోకేశ్ ను ప్రధాని మోదీ పలుమార్లు ప్రశంసించారన్న సంగతి తెలిసిందే. తాజాగా భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా కూడా లోకేశ్ ను మోదీ మరోసారి పొగడ్తల్లో ముంచెత్తారు. "శభాష్ లోకేశ్, చాలా బాగా పనిచేస్తున్నావు..ఇదే వేగం, స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుకు సాగాలి" అంటూ లోకేశ్ భుజం తట్టి మరీ మోదీ అభినందించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళుతున్న ప్రధాని మోదీకి లోకేశ్ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆప్యాయంగా లోకేశ్‌తో మోదీ మాట్లాడారు. ఈ క్రమంలోనే లోకేశ్ పనితీరుపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. ఏపీలో ప్రధాని మోదీ గత పర్యటనలను విజయవంతం చేయడంలో, 'యోగాంధ్ర' కార్యక్రమం ద్వారా ప్రపంచ రికార్డు సాధించడంలో లోకేశ్ చూపిన చొరవను ప్రధాని అప్పట్లోనూ మెచ్చుకున్న విషయం తెలిసిందే.

Tags
pm modi minister lokesh compliments Bhogapuram International Airport
Recent Comments
Leave a Comment

Related News