2 నిమిషాలు..జగన్ కు బాబు వార్నింగ్

admin
Published by Admin — August 07, 2026 in Andhra
News Image
ఏపీ మాజీ సీఎం జగన్ పై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్ తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల అరాచకాలకు చెక్ పెట్టేందుకు తనకు 2 నిమిషాలు చాలని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇక, పారదర్శకంగా డీఎస్సీ నియామకాలు చేపట్టామని, అయినా సరే ఆ విషయంపై నానా యాగీ చేస్తోందని మండిపడ్డారు. ఆ వ్యవహారంలో వైసీపీ నేతలకు కోర్టు చివాట్లు కూడా పెట్టిందని చంద్రబాబు గుర్తు చేశారు.

అయినా సరే అనవసరంగా డీఎస్సీపై రాద్దాంతం చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఇక, డీఎస్సీ వ్యవహారంలో వైసిపి దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టాలని టిడిపి నేతలు, శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ పరామర్శకు వస్తుంటే ఏం జరుగుతుందో అని జనం భయపడే పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
Tags
cm chandrababu warning jagan ycp tdp
Recent Comments
Leave a Comment

Related News