బ్రాహ్మణుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయకత్వం శ్రీరామరక్ష: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్

admin
Published by Admin — August 19, 2026 in Andhra
News Image

కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో నిర్వహించిన బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్ శ్రీ కె. బుచ్చి రాంప్రసాద్ గారు, సంస్థ ఎండీ శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారు, సీఈఓ శ్రీ నాగ సాయిగారు,డైరెక్టర్ శ్రీ పి.వి. ఫణి కుమార్ గారు,కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ విజయవాడ బ్రాంచ్ మేనేజర్ శ్రీ గోర్తి శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి గన్నవరం నియోజకవర్గానికి చెందిన బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ కె. బుచ్చి రాంప్రసాద్ గారు మాట్లాడుతూ, బ్రాహ్మణుల సంక్షేమం, ఆత్మగౌరవం, ఆర్థిక అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని కొనియాడారు. బ్రాహ్మణుల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం శ్రీరామరక్ష అని, బ్రాహ్మణ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు..

బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, సంక్షేమ కార్యక్రమాలకు సంస్థాగత రూపం కల్పించిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిదేనని అన్నారు. బ్రాహ్మణ సమాజ అభ్యున్నతి కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంతోమంది కుటుంబాలకు అండగా నిలిచాయని పేర్కొన్నారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారు సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చైర్మన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాలకు మళ్లీ ప్రాధాన్యత లభించిందని అన్నారు.

2019–2024 మధ్య రాష్ట్రంలో జరిగిన పాలనను ప్రజలు ప్రత్యక్షంగా చూశారని, ఆ పాలనకు స్వస్తి పలికి కూటమి ప్రభుత్వానికి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని చైర్మన్ పేర్కొన్నారు. గత పాలనలో నిర్వీర్యమైన సంక్షేమ వ్యవస్థలకు మళ్లీ ఊపిరి పోసి, బ్రాహ్మణ సమాజానికి తగిన ప్రాధాన్యత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా బ్రాహ్మణ కుటుంబాలకు ఆర్థిక సహకారం, రుణ సదుపాయాలు అందిస్తూ స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబనకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని చెప్పారు. అవసరమైన వారికి రుణ సదుపాయాలు అందించి వారి ఆర్థిక పురోగతికి సంస్థ కృషి చేస్తోందని తెలిపారు.

గన్నవరం శ్రీ గాయత్రి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు...

మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రాహ్మణ సంక్షేమ కృషికి కృతజ్ఞతగా గన్నవరం గ్రామంలోని శ్రీ గాయత్రి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు, మరింత శక్తి ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో బ్రాహ్మణులు పాల్గొని తమ కృతజ్ఞతను చాటుకున్నారు.

బ్రాహ్మణ సమాజ సంక్షేమం కోసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్న కార్యక్రమాలకు బ్రాహ్మణ సమాజం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాయకులు పేర్కొన్నారు.

చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మంత్రి శ్రీ నారా లోకేష్ గారి యువ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని చైర్మన్ తెలిపారు. బ్రాహ్మణ సమాజం కూడా ప్రభుత్వానికి అండగా నిలిచి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

గన్నవరం నియోజకవర్గ బ్రాహ్మణులు తమ సమస్యలు, సూచనలను చైర్మన్ దృష్టికి తీసుకురాగా, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గ బ్రాహ్మణ పెద్దలు, యువత, మహిళలు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
Tags
Cm chandrababu's leadership is Sri Rama Raksha for brahmins says AP bramhan welfare corporation chairman buchi ram Prasad
Recent Comments
Leave a Comment

Related News