25 నుంచి 270 కోట్లు.. బ్రాహ్మణుల కోసం చంద్రబాబు విజన్ అద్భుతం: బుచ్చి రాంప్రసాద్

admin
Published by Admin — August 20, 2026 in Andhra
News Image

బ్రాహ్మణుల ఆర్థిక అభ్యున్నతి, స్వావలంబన కోసం మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గొల్లపూడిలోని బ్రాహ్మణ సంక్షేమ సంస్థ కార్యాలయంలో వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్ కె. బుచ్చి రాంప్రసాద్ గారు మాట్లాడుతూ, బ్రాహ్మణుల ఆర్థిక స్వావలంబన కోసం క్రెడిట్ సొసైటీకి పునాది వేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

“బ్రాహ్మణుల కోసం చంద్రబాబు గారు 12 సంవత్సరాల క్రితం వేసిన అడుగు నేడు దేవుడి దీవెనగా మారింది. రూ.25 కోట్లతో ప్రారంభమైన క్రెడిట్ సొసైటీ నేడు రూ.270 కోట్ల టర్నోవర్ స్థాయికి చేరుకోవడం చంద్రబాబు గారి దూరదృష్టికి నిదర్శనం. ఇది కేవలం ఒక ఆర్థిక సంస్థ సాధించిన విజయం కాదు.. బ్రాహ్మణులు తమ కాళ్లపై తాము నిలబడాలనే ఆయన సంకల్పానికి సజీవ సాక్ష్యం” అని బుచ్చి రాంప్రసాద్ గారు అన్నారు.

ప్రస్తుతం సొసైటీ 82,000 మందికి పైగా సభ్యులతో, రూ.77 కోట్లకు పైగా డిపాజిట్లతో, రూ.112 కోట్లకు పైగా రుణాలతో ముందుకు సాగుతోందని తెలిపారు. బ్రాహ్మణ కుటుంబాలకు పొదుపు, రుణ సదుపాయం, ఆర్థిక భరోసా కల్పించడంలో సొసైటీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

రూ.600 సభ్యత్వంతో ప్రత్యేక సంక్షేమ ప్రయోజనాలు

బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ సభ్యత్వం ద్వారా అందుబాటులో ఉన్న ప్రయోజనాలను ప్రతి బ్రాహ్మణ కుటుంబానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని చైర్మన్ అన్నారు.

“కేవలం రూ.600తో సభ్యత్వం తీసుకునే అవకాశం ఉంది. 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల సభ్యులకు, నిబంధనలు మరియు అర్హతలకు లోబడి సహజ మరణం సంభవించినప్పుడు రూ.50,000 వరకు ఆర్థిక సహాయం అందించే ప్రత్యేక సంక్షేమ ప్రయోజనం ఉంది. ఇది సాధారణ లైఫ్ ఇన్సూరెన్స్‌కు ప్రత్యామ్నాయం కాదు; సొసైటీ సభ్యులకు అందించే సంక్షేమ ప్రయోజనం” అని ఆయన తెలిపారు.

ఈ ప్రయోజనాలపై ప్రతి బ్రాహ్మణ కుటుంబానికి అవగాహన కల్పించి, అర్హత ఉన్నవారు సభ్యత్వం తీసుకుని సొసైటీ అందించే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని బుచ్చి రాంప్రసాద్ గారు పిలుపునిచ్చారు.

చంద్రబాబు గారికి కృతజ్ఞతలు

ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంక్షేమ సంస్థ డైరెక్టర్లు అమలాపురం అక్కెళ్ల నారాయణమూర్తి, కృష్ణా జిల్లా పి.వి. ఫణికుమార్, గుంటూరు జిల్లా వెలగలేటి గంగాధర్, గార్లపాటి విజయ్ కుమార్, శివశర్మ, సీఈఓ నాగ సాయి, విజయవాడ బ్రాంచ్ మేనేజర్ జి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారంతా బ్రాహ్మణుల ఆర్థిక అభ్యున్నతి కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న దూరదృష్టితో కూడిన నిర్ణయాలను కొనియాడుతూ, ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

“రూ.25 కోట్లతో ప్రారంభమైన సొసైటీ నేడు రూ.270 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవడం వెనుక చంద్రబాబు గారు వేసిన బలమైన పునాది ఉంది. బ్రాహ్మణుల ఆర్థిక స్వావలంబనకు ఆయన ఆలోచన ఒక మార్గదర్శకం. బ్రాహ్మణ సంక్షేమ సంస్థ, దాని అనుబంధ క్రెడిట్ సొసైటీ ద్వారా మరింత మంది బ్రాహ్మణ కుటుంబాలకు సంక్షేమం, ఆర్థిక చేయూత అందించేలా కృషి చేస్తాం” అని చైర్మన్ కె. బుచ్చి రాంప్రసాద్ గారు తెలిపారు.

రూ.25 కోట్లతో మొదలైన ప్రస్థానం.. రూ.270 కోట్ల టర్నోవర్ వరకు..

82 వేల మందికి పైగా సభ్యులు.. రూ.77 కోట్లకు పైగా డిపాజిట్లు.. రూ.112 కోట్లకు పైగా రుణాలు..

బ్రాహ్మణుల ఆర్థిక స్వావలంబనకు చంద్రబాబు గారి దూరదృష్టి బలమైన పునాదిగా నిలిచిందని చైర్మన్ కె. బుచ్చి రాంప్రసాద్ గారు..పేర్కొన్నారు.

News Image
News Image
News Image
News Image
News Image
News Image
Tags
Cm chandrababu's vision for brahmins welfare is tremendous says AP bramhan welfare corporation chairman buchi ram Prasad
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News

Latest News