వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై మంత్రి నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్‌కు ఆ తేడా కూడా తెలియదని వ్యాఖ్యానించారు. తాజాగా గురువారం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీలో జరి గిన అవకతవకలను ప్రస్తావించారు. ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియదా? అని జగన్‌ను ప్రశ్నించారు. అంతేకాదు.. ఈ రెండు పరీక్షలకు ఉన్న బేధాలు కూడా ఆయనకు తెలియకపోవడం దారుణమని పేర్కొన్నారు.
డీఎస్సీ అనేది ఉపాధ్యాయులకు సంబంధించి నిర్వహించే పరీక్ష అని పేర్కొన్న లోకేష్.. ఏపీపీఎస్సీ అనేది రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పలు పరీక్షలకు సంబంధించిన వ్యవహారమని పేర్కొన్నారు. కానీ.. ఈ తేడా కూడా జగన్‌కు తెలియదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నిర్వహించే పరీక్షలకు, బోర్డు నిర్వహించే పరీక్షలకు, కమిషన్ నిర్వహించే పరీక్షలకు తేడా తెలియదా? అని ప్రశ్నించారు. ఆయా పరీక్షలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు.
డీఎస్సీ అనేది ప్రభుత్వం నేరుగా నిర్వహిస్తుంది. ఏపీపీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధమైన ఒక సంస్థ నిర్వ హిస్తుందని.. బోర్డు పరీక్షలు అందరికీ తెలిసిందేనని లోకేష్ పేర్కొన్నారు. ఈ విషయం తెలియకుండానే గంట సేపు జగన్ మీడియా ముందు సోది చెప్పారని తెలిపారు. ఇక, జగన్ తన హయాంలో ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించలేదని లోకేష్ దుయ్యబట్టారు. 2019 ఎన్నికలకు ముందు డీఎస్సీ వేస్తామని ఊరించి.. అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయులపై కక్ష కట్టినట్టు వ్యవహరించారని అన్నారు.
అసెంబ్లీకి రావచ్చుగా..
డీఎస్సీపై మాట్లాడుతున్న జగన్ అండ్ కో అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని లోకేష్ ప్రశ్నించారు. డీఎ స్సీ సహా ఏ విషయంపైనైనా స్పందించేందుకు, సమాధానం చెప్పేందుకు తాము సిద్ధమేనన్నారు. కానీ, అసెంబ్లీకి రాకుండా జగన్ తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు. డీఎస్సీపై ఇప్పటికే అన్ని సందేహాలను ప్రభుత్వం తరఫున పరిష్కరించామని, అధికారులు కూడా అనేక సందర్భాల్లో వివరణ ఇచ్చారని తెలిపారు. అయినా.. పదే పదే విమర్శలు చేస్తూ.. అభ్యర్థులను గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు.