ల‌క్ అంటే చిరూదే.. చివరి నిమిషంలో బ్రతికిపోయారుగా..!

admin
Published by Admin — August 25, 2026 in Movies
News Image

సినిమా ఇండస్ట్రీలో 'టైమింగ్' ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. కానీ ఒక్కోసారి అనుకోకుండా జరిగే ఆలస్యమే మనల్ని ఊహించని ముప్పు నుంచి కాపాడుతుంది. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఆగస్ట్ 22న ఆయన పుట్టినరోజు కానుకగా 'ముఠా మేస్త్రి' రీమాస్టర్డ్ వెర్షన్‌ను థియేటర్లలోకి తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రైలర్ కూడా వదిలి రచ్చ చేశారు. అయితే, ఆఖరి క్షణంలో సాంకేతిక కారణాల వల్ల ఆ రీ-రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పైకి ఇది ఫ్యాన్స్‌కి కాస్త నిరాశ కలిగించినా.. నిజానికి ఈ నిర్ణయం చిరూ ఇమేజ్‌ని ఒక పెద్ద సోషల్ మీడియా దాడి నుంచి కాపాడింది.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల కేటాయింపుపై తీవ్రమైన యుద్ధం నడుస్తోంది. ఒకవైపు 'ఇరుముడి(Irumudi)' సినిమా మంచి హిట్ టాక్‌తో స్క్రీన్లను హోల్డ్ చేస్తుంటే, మరోవైపు భారీ అంచనాలతో వస్తున్న 'టాక్సిక్' సినిమాకు థియేటర్ల కొరత ఏర్పడింది. ఈ రెండు సినిమాల మధ్య స్క్రీన్స్ కేటాయింపుల విషయంలో సోషల్ మీడియా మొత్తం దిల్ రాజుపై విపరీతంగా విరుచుకుపడుతోంది.

సరిగ్గా ఇలాంటి రచ్చ జరుగుతున్న సమయంలో.. కేవలం పుట్టినరోజు వేడుకల పేరుతో 'ముఠా మేస్త్రి' రీ-రిలీజ్ అయి, రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో 50 థియేటర్లను ఆక్రమించి ఉంటే పరిణామాలు చాలా ఘోరంగా ఉండేవి. ఇప్పటికే నెట్టింట చిరంజీవిని టార్గెట్ చేయడానికి ఒక వర్గం కాచుకుని కూర్చుంది. అలాంటిది ఈ టైమ్‌లో పాత సినిమా కోసం థియేటర్లు బ్లాక్ చేస్తే.. ఆ ట్రోలింగ్‌కి ఆజ్యం పోసినట్లయ్యేది. దిల్ రాజు(Dil Raju)పై వస్తున్న నెగెటివిటీ అంతా మెగాస్టార్‌పైకి మళ్లే ప్రమాదం స్పష్టంగా కనిపించింది. "ఆలస్యం అమృతం విషం" అంటారు కానీ.. ఇక్కడ ఆ సాంకేతిక లోపమే చిరంజీవికి శ్రీరామరక్షగా మారింది. అనుకోకుండా జరిగిన ఆ వాయిదా నిర్ణయం ఆయనను ఒక భారీ సోషల్ మీడియా వివాదం నుంచి, బ్రాండ్ డ్యామేజ్ నుంచి సునాయాసంగా బయటపడేసింది.

Tags
Chanjeevi Megastar Chanjeevi Mutha Mestri Mutha Mestri Re Release Dil Raju Irumudi Toxic Movie Telugu Cinema
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News