జ‌గ‌న్ బిల్డ‌ప్ బాబాయ్ క‌ల‌రింగ్: లోకేష్

admin
Published by Admin — August 29, 2026 in Andhra
News Image

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్‌.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం ఒంగోలు లో ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా స్థానిక వెలిగొండ ప్రాజెక్టు వ్య‌వ‌హారం పై మాట్లాడుతూ.. దీనికి శంకుస్థాప‌న చేసింది.. రేపు ప్రారంభించేది కూడా సీఎం చంద్ర‌బాబేన‌ని చెప్పారు. కానీ.. తానేదో చేసిన ట్టు జ‌గ‌న్ బిల్డ‌ప్ బాబాయ్ మాదిరిగా క‌ల‌రింగ్ ఇస్తున్నాడ‌ని వ్యాఖ్యానించారు. ఆయ‌న మాట‌లు ఎవ‌రూ న‌మ్మ‌బోర‌ని అన్నా రు.

జ‌గ‌న్‌ను సొంత చెల్లి, త‌ల్లే న‌మ్మ‌డం లేద‌ని లోకేష్ వ్యాఖ్యానించారు. వారి గొడ్డ‌లి పార్టీలోనే జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌కు విలువ లేద‌న్నా రు. తాను చేసింది.. గొడ్డ‌లి, హ‌త్య‌లేన‌ని.. వాటిని చెప్పుకొంటే.. ప్ర‌జ‌లు ఛీకొడ‌తార‌ని భ‌య‌ప‌డి.. టీడీపీ హ‌యాంలో జ‌రిగిన ప‌నుల‌ను త‌న హ‌యాంలో జ‌రిగిన ప‌నులుగా చెప్పుకొంటూ..క్రెడిట్ చోరీకి పాల్ప‌డుతున్న దొంగ నేత అని వ్యాఖ్యానించారు. ఇలాంటి నేత‌లు అరుదుగా మాత్ర‌మే ఉంటార‌ని వ్యాఖ్యానించారు. అయితే.. ఏపీలో ఉండ‌డం ప్ర‌జ‌లు చేసుకున్న దుర‌దృష్ట‌క‌ర మ‌న్నారు.

డీఎస్సీ-2025లో ఏదో జ‌రిగిపోయింద‌ని జ‌గ‌న్ అండ్ కో శోకాలు పెట్టార‌ని.. కానీ, అక్క‌డ ఏమీ జ‌ర‌గ‌లేద‌ని ఉపాధ్యాయులే తిర‌గ‌బ‌డే స‌రికి తోక ముడిచార‌ని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. తాను వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తి లేద‌ని తేల్చి చెప్పారు.ఈ ఏడాది, వ‌చ్చే ఏడాది కూడా.. వేలాది పోస్టుల‌తో డీఎస్సీ ని నిర్వ‌హిస్తామ‌న్నారు. త‌న ప‌నితీరును హైకోర్టు కూడా మెచ్చుకుంద‌ని చెప్పారు. కానీ, జ‌గ‌న్ ప‌నితీరుకు.. దేశంలోని అన్ని కోర్టులు చీవాట్లు పెట్టాయ‌ని .. గ‌త వైసీపీ పాల‌న‌ను గుర్తు చేశారు. అందుకే అబ‌ద్ధాలు చెప్పుకొని రోజులు గ‌డుపుతున్నాడ‌ని అన్నారు.

ద‌త్త‌త తీసుకుంటా..

ఒంగోలు ప‌ర్య‌ట‌నలో భాగంగా ప‌లు ప్రాంతాల్లోప ర్య‌టించిన మంత్రి లోకేష్‌.. అక్క‌డి ప‌రిస్థితుల‌ను తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా స్థానిక నాయ‌కులు పోతురాజు కాలువ ను బాగు చేయించాల‌ని కోరారు. దీనిని ప‌రిశీలించిన లోకేష్‌.. పోతురాజు కాలువ బాగుచేసే బాధ్యత తీసుకుంటానని.. అవ‌స‌ర‌మైతే.. తాను ద‌త్త‌త తీసుకుంటాన‌ని చెప్పారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై ఈ సంద‌ర్భంగా ప్ర‌శంస‌లు గుప్పించారు. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నాక‌.. ఒంగోలు రూపురేఖలు మారాయని చెప్పారు. జ‌నార్ద‌న్ ప‌నితీరు బాగుంద‌ని ప్ర‌శంసించారు. 

Tags
Lokesh jagan build up babai
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News