బ్రాహ్మణ కార్పొరేషన్ నూతన మేనేజింగ్ డైరెక్టర్‌గా శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ బుచ్చి రామ్ ప్రసాద్ గారు ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
నూతన బాధ్యతల్లో శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారు విజయవంతంగా పనిచేస్తూ, బ్రాహ్మణ సమాజ సంక్షేమం మరియు అభ్యున్నతికి మరింత సమర్థవంతంగా సేవలందించాలని ఛైర్మన్ శ్రీ బుచ్చి రామ్ ప్రసాద్ గారు ఆకాంక్షించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా చేరేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్లు శ్రీ పి.వి. ఫణికుమార్ గారు, శ్రీ వెలగలేటి గంగాధర్ గారు,... మరియు గార్లపాటి విజయ్ కుమార్ గారు, శ్రీ శివ శర్మ గారు, సీఈఓ శ్రీ నాగ సాయి గారు, విజయవాడ మేనేజర్ శ్రీ జి. శ్రీనివాస్ గారు, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని నూతన ఎండీ శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారికి శుభాకాంక్షలు తెలిపారు.