నాగ్ `కింగ్ 100`లో హీరోయిన్‌గా తెలుగ‌మ్మాయి ఫిక్స్‌.!

admin
Published by Admin — August 30, 2026 in Movies
News Image

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కెరీర్‌లో అత్యంత మైలురాయిగా నిలవనున్న 100వ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ` కింగ్ 100` టైటిల్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి వినిపిస్తున్న ఓ క్రేజీ న్యూస్ సినిమా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ చిత్రంలో నాగార్జున సరసన తెలుగమ్మాయి, టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) కథానాయికగా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో జరుగుతున్న షూటింగ్ స్పాట్ నుంచి ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న పిక్స్‌తో పాటు, దర్శకుడు రా కార్తీక్‌తో దిగిన సెల్ఫీని ఆమె పంచుకోవడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది.

దర్శకుడు రా. కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కేవలం ఐశ్వర్య రాజేష్ మాత్రమే కాకుండా, సీనియర్ నటి టబు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించే సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుండగా, అన్నపూర్ణ స్టూడియోస్, టీ-సిరీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. నాగ్ పుట్టినరోజు సందర్భంగా శ‌నివారం విడుదలైన కింగ్ 100(King100)టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే డిజిటల్ మాధ్యమాలలో రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ జోరు చూస్తుంటే, నాగార్జున తన కెరీర్ మైలురాయి చిత్రాన్ని అభిమానులు గర్వపడేలా ఒక విజువల్ వండర్‌గా మలచబోతున్నారని స్పష్టమవుతోంది. 

Tags
King100 Akkineni Nagarjuna Aishwarya Rajesh Nagarjuna Tollywood King 100 Glimpse Annapurna Studios
Recent Comments
Leave a Comment

Related News