సెప్టెంబర్ 9న ఎన్నారై టీడీపీ గ్లోబల్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం: డాక్టర్ రాజా

admin
Published by Admin — August 30, 2026 in Nri
News Image

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్నారై టీడీపీ గ్లోబల్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుందని గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్‌ డాక్టర్ రాజా వెల్లడించారు. సెప్టెంబరు 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు హాజరు కాబోతున్నారని వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని డాక్టర్ రాజా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి ఎన్నారై టీడీపీ నేతలు, సెంట్రల్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారని వెల్లడించారు. మునుపెన్నడూ జరగని విధంగా ఈ ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రంగం సిద్ధమైందన్నారు.

కొద్దిరోజుల క్రితం అమెరికాలో పర్యటించిన నారా లోకేశ్ తో డాక్టర్ రాజా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురించి చర్చించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 9వ తేదీన ఈ కార్యక్రమం జరపాలని నిర్ణయించారు. మునుపెన్నడూ లేని విధంగా ఎన్నారై టీడీపీ గ్లోబల్ కమిటీ నియామకం జరిగింది. అంతేకాదు, ఆ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం ఏపీలో జరగడం, ఆ కార్యక్రమానికి చంద్రబాబు, లోకేశ్ హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

News Image
News Image
News Image
News Image
Tags
nri tdp central committee swear in ceremony September 9th Mangalagiri global nri tdp chief doctor raja
Recent Comments
Leave a Comment

Related News

Latest News