ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ప్రవాస బాలల అంతర్జాల సాహితీ సమ్మేళనం

admin
Published by Admin — September 03, 2026 in Nri
News Image

4వ ప్రపంచ తెలుగు మహా సభలు - బాలలు (2026) సందర్భంగా అమెరికాలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 26వ తేదీన ప్రవాస బాలల అంతర్జాల  సాహితీ సమ్మేళనం ఘనంగా నిర్వహించబోతున్నాం. 

ప్రపంచవ్యాప్తంగా (భారతదేశం మినహా) ఇతర దేశాలలో నివసిస్తున్న 16 సంవత్సరాల లోపు, ప్రవాస తెలుగు బాల బాలికల కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం అంతర్జాల మాధ్యమంగా నిర్వహించబడుతోంది. 

కవిత, పద్యం, పాట, కథ, ఏకపాత్రాభినయం...ఇలా బాలబాలికలకు నచ్చిన అంశంలో ప్రతిభను అంతర్జాలంలో ప్రదర్శించేందుకు ఇదో గొప్ప అవకాశం. త్వరగా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాము. భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 26వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. 

నియమ నిబంధనలు

పద్య పఠనం: రెండు తెలుగు పద్యాలు చదవాలి... 2 నిమిషాలు వ్యవధి.

కవితా పఠనం: స్వీయ కవిత లేదా వేరొకరి కవిత చదవ వచ్చు.. వ్యవధి 2 నిమిషాలు

ఏకపాత్రాభినయం: వ్యవధి - 2 నిమిషాలు

కథ చెబుతా: వ్యవధి 5 నిమిషాలు

పాడనా తెలుగు పాట: లలిత గీతాలు లేక శాస్త్రీయ సంగీతం - వ్యవధి 3 నిమిషాలు

గమనిక: తెలుగు భాష, సంప్రదాయం, సంస్కృతికి విఘాతం కలిగించే ప్రదర్శన అంశాలు తిరస్కరించుట /నిలిపివేయుట వంటి అంశాలలో ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వాహక కమిటీ సభ్యులదే తుది నిర్ణయం

ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 15వ తేదీ లోపు నమోదు చేసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి.

https://forms.gle/9kgD9h6nxcJY7dEu8

పాల్గొనదలచిన వారు సంప్రదించండి.

సంధానకర్తలు:

రాధిక మంగిపూడి : +91 90294 09696

ఫణి మాధవ్ కస్తూరి : +91 91219 06969

అధ్యక్షుడు: డా. గజల్ శ్రీనివాస్

Registration: www.andhrasarawathaparishath.org

Tags
by andhra saraswata parishat in USA Antarjala sahithi sammelanam
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News

Latest News