చంద్రబాబు, లోకేశ్ లకు గ్లోబల్ ఎన్నారై టీడీపీ కమిటీ ఆహ్వానం

admin
Published by Admin — September 05, 2026 in Andhra
News Image

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్లోబల్ ఎన్నారై టీడీపీ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సెప్టెంబరు 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ లను గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్‌ డాక్టర్ రాజా, పలువురు ఎన్నారైలు ఆహ్వానించారు. ఈ రోజు చంద్రబాబు, లోకేశ్ లను స్వయంగా కలిసి ఆహ్వానం పలికారు.

గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్ డాక్టర్ రాజాతోపాటు ఎన్నారైల ఆహ్వానాన్ని చంద్రబాబు, లోకేశ్ స్వీకరించారు. ఆ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతామని తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎన్నారైలతో మమేకమై మాట్లాడారు. మరోవైపు, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని డాక్టర్ రాజా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి ఎన్నారై టీడీపీ నేతలు, సెంట్రల్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారని వెల్లడించారు. ఈ తరహా కమిటీ తొలిసారి ఏర్పాటు కావడం, ఆ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం ఏపీలో జరగడం, ఆ కార్యక్రమానికి చంద్రబాబు, లోకేశ్ హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

News Image
Tags
Cm chandrababu minister lokesh global NRI TDP committee invited Swear in ceremony
Recent Comments
Leave a Comment

Related News