దళపతి విజయ్(Thalapathy Vijay) రాజకీయ ప్రవేశంతో ఒకవైపు తమిళనాట పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంటున్న సమయంలో, ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్ తాజాగా లండన్ పర్యటనకు సిద్ధమవ్వడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విదేశీ పర్యటన కేవలం వ్యక్తిగతమా లేక దీని వెనుక అసలు కథ వేరే ఉందా అన్న చర్చ ఇప్పుడు ఊపందుకుంది.
కొంతకాలంగా విజయ్, ఆయన భార్య సంగీత(Sangeetha) మధ్య మనస్పర్థలు వచ్చాయన్న ప్రచారం కోలీవుడ్ వర్గాల్లో తీవ్రంగా నడిచింది. ఇద్దరూ విడాకులు తీసుకునే వరకు వెళ్లడం అభిమానులను తీవ్రంగా కలవరపెట్టాయి. ఈ వ్యవహారంపై అటు విజయ్ కానీ, ఇటు ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. ఎవరి పనుల్లో వారు బిజీగా గడుపుతూ వస్తున్న తరుణంలో, ఇటీవల సంగీత తన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారనే వార్త తెరపైకి రావడం తీవ్ర చర్చనీయాంశం అయింది.
ఈ ఒక్క పరిణామంతో విజయ్(Vijay) ఫ్యామిలీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయనే వాదన బలపడింది. లండన్‌లో ఉంటున్న సంగీత, కూతురు దివ్యను విజయ్ ఈ పర్యటనలో కలవబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. విడాకుల కేసు ఉపసంహరణ, విజయ్ లండన్ ట్రిప్ ఒకే సమయంలో జరగడంతో ఇదంతా ప్యాచప్ కోసమే జరుగుతున్న ప్రయత్నంగా అందరూ భావిస్తున్నారు. ఇన్నాళ్లుగా వీళ్ల కాపురంపై వస్తున్న ఊహాగాణాలకు ఈ భేటీతో పూర్తిగా తెరపడే అవకాశం ఉందనేది సినీ విశ్లేషకుల అంచనా.
మరి రాజకీయంగా ఎన్నో కీలక అడుగులు వేస్తున్న విజయ్, తన పర్సనల్ లైఫ్‌లోనూ అలాంటి సానుకూల నిర్ణయమే తీసుకోబోతున్నారా? లండన్(London) గడ్డపై తన భార్యతో కలిసి ఆయన కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే విజయ్ లండన్ ట్రిప్ పూర్తియ్యే వరకు వేచి చూడాల్సిందే.