గుంటూరులో ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నిమజ్జన మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కె. బుచ్చి రామ్ ప్రసాద్ గారు, గుంటూరు ఎంపీ శ్రీ భాష్యం రామకృష్ణ గారు, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ గుంటూరు డైరెక్టర్ శ్రీ వెలగలేటి గంగాధర్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. అనంతరం నిర్వహించిన అన్నవితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, భక్తులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.