టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తరచూ బాక్సాఫీస్ వార్స్‌తో హీట్ పెంచే ఇద్దరు దిగ్గజాలు, రియల్ లైఫ్‌లో మాత్రం ఒకరికొకరు ఎంతగానో గౌరవించుకుంటారు. ఇప్పుడు ఆ అన్యోన్యతకు మరో మైలురాయి చేరనుంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నివాసానికి కూతవేటు దూరంలో, జూబ్లీహిల్స్ వీఐపీ జోన్లో నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) సరికొత్త రాజప్రసాదాన్ని ముస్తాబు చేస్తున్నారు. రూ. 100 కోట్ల పైచిలుకు అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ అల్ట్రా లగ్జరీ విల్లా ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
దశాబ్దాల పాటు బంజారాహిల్స్‌లోని సెంటిమెంట్ హౌస్‌లో ప్రయాణం సాగించిన బాలయ్య(Balayya), నగర ట్రాఫిక్ కష్టాలను దూరం చేసే ఎలివేటెడ్ కారిడార్ కోసం తన పాత ఇంటి స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చి ఆదర్శంగా నిలిచారు. ఆ చారిత్రక జ్ఞాపకాలను పక్కన పెట్టి, కుటుంబంతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆయన ఈ సరికొత్త విల్లాను ఎంచుకున్నారు. దాదాపు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తులుగా (G+2) వెలుగొందుతున్న ఈ భవనం హాలీవుడ్ రేంజ్ హంగులతో కనువిందు చేస్తోంది.
ఈ విలాసవంతమైన భవనంలో అత్యాధునిక సౌండ్ టెక్నాలజీతో కూడిన ప్రైవేట్ హోమ్ థియేటర్, బాలకృష్ణ ఫిట్నెస్ కోసం ప్రత్యేక జిమ్, రిలాక్సేషన్ కోసం స్విమ్మింగ్ పూల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక ఇంటి ఇంటీరియర్ డిజైనింగ్ బాధ్యతలను నందమూరి వసుంధరా దేవి(Vasundhara Devi) స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తెలుగు సంప్రదాయపు వన్నె తరగకుండా, మోడర్న్ రాయల్ లుక్ వచ్చేలా ప్రతి మూలను ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దారు.
మెగాస్టార్(Megastar) నివాసానికి అతి సమీపంలో, సినీ-రాజకీయ ప్రముఖుల నడుమ కొలువుదీరుతున్న ఈ వంద కోట్ల డ్రీమ్ హౌస్‌లోకి బాలయ్య కుటుంబం అతి త్వరలోనే గ్రాండ్‌గా అడుగుపెట్టనుంది. ఇటు సినిమాలతో పాటు రాజకీయాల్లో బిజీగా ఉండే బాలయ్య బాబు, ఈ సరికొత్త లగ్జరీ అడ్డా నుంచి ఎలాంటి సరికొత్త జోరు చూపించబోతున్నారోనని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.