కూట‌మికి ఇవి చాలు.. రిజ‌ర్వేష‌న్ + డెవ‌ల‌ప్‌మెంట్‌.. !

admin
Published by Admin — October 12, 2026 in Politics
News Image

కూట‌మి స‌ర్కారుకు వ‌చ్చేస్థానిక ఎన్నిక‌ల్లో రెండుకీల‌క విష‌యాలు ప్ల‌స్‌గా మారుతున్నాయి. వీటిలో ప్ర‌ధానంగా రిజ ర్వేష‌న్ క‌ల్ప‌న‌, రెండు అభివృద్ధి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత కీల‌క‌మైన రిజ‌ర్వేష‌న్‌, అభివృద్ధి ఆధారంగానే స్థానిక ఎన్నిక‌లు ఆధార‌ప‌డి ఉంటాయ‌ని తెలుస్తోంది. బీసీల‌కు 34 శాతం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని ప్ర‌య‌త్నించినా.. అది విఫ‌లం కావ‌డంతో మ‌రో రూపంలో డెడికేటెడ్ క‌మిష‌న్ సూచ‌న‌ల‌ను అందిపుచ్చుకున్న కూట‌మి ప్ర‌భుత్వం రిజర్వేష‌న్ల‌ను సాకారం చేసుకునే దిశ‌గా అడుగులు వేసింది.

ముఖ్యంగా మేయ‌ర్లు, మునిసిప‌ల్ చైర్మ‌న్ల రిజ‌ర్వేష‌న్ల‌ను 34 శాతం మేర‌కు అమ‌లు చేస్తున్నారు. ఇది న‌గ‌రాలు, ప‌ట్ట ణాలు కార్పొరేష‌న్ల‌లో క‌లిసి వ‌స్తోంది. అలానే.. ఇత‌ర మునిసిప‌ల్ స్థానాల్లోనూ రిజ‌ర్వేష‌న్ల‌ను ఖ‌రారు చేయ‌డం.. గతం కంటే కూడా కొంత మేర‌కు ఎక్కువ‌గానే ఉన్న నేప‌థ్యంలో ఇది కూట‌మి ప్ర‌భుత్వానికి అనుకూలంగానే మార నుంది. మ‌రోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిని ప‌రుగులు పెట్టిస్తున్నారు. ప్ర‌తి జిల్లాలోనూ సాగు, తాగు నీటి ప్రాజెక్టుల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం ద్వారా.. రైతులు, ప్ర‌జ‌ల‌ను కూడా ప్ర‌భావితం చేసే అవ‌కాశం మెండుగానే క‌నిపిస్తోంది.

అదేస‌మ‌యంలో ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాల‌నుకూడా మెరుగు ప‌రుస్తున్నారు. వ‌రుస‌గా ఇస్తున్న ఉద్యోగ నోటిపికే ష‌న్లు యువ‌త‌ను ఆక‌ర్సిస్తున్నాయి. అలానే.. డీఎస్సీలో 16 వేల ఉద్యోగాలు ఇవ్వ‌డం.. త్వ‌ర‌లోనే మ‌రో డీఎస్సీకి రంగం రెడీ చేయ‌డం వంటివి క‌లిసి వ‌స్తున్న ప‌రిణామాలుగానే చెప్పాలి. ఇక‌, ఇప్ప‌టికే గ్రూప్‌-1 ఉద్యోగాల నోటిఫికేష‌న్ల‌ను ఇచ్చారు. ఇవి కూడా సానుకూల ధోర‌ణిని చూపిస్తున్నాయి. ప్ర‌ధానంగా మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాన్ని మురిపించేలా ర‌హ‌దారులు, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న వంటివి కూడా ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేయ‌నున్నాయి.

అయితే.. పంటికింద రాయి మాదిరిగా ప్ర‌స్తుతం ధ‌ర‌లు పెరుగుతున్న తీరు.. ముఖ్యంగా నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతుండ‌డం వంటివి కూడా స‌ర్కారును ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. దీనిని త‌గ్గించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నా.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం ఆశించిన మేర‌కు ఫ‌లితం క‌నిపించ‌డం లేదు. దీనిని కొంత మేర‌కు త‌గ్గించ గ‌లిగితే స్థానిక ఎన్నిక‌ల్లో కూట‌మి విజ‌యం ఖాయ‌మ‌ని.. అంటున్నారు. ప్ర‌ధానంగా ఏక‌గ్రీవాల మాట ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. పోటీ ఉన్న‌ప్ప‌టికీ.. విజ‌యం ద‌క్కించుకునేందుకు అభివృద్ధి-రిజ‌ర్వేష‌న్లు క‌లిసి వ‌స్తాయ‌ని అంటున్నారు.

Tags
Cm chandrababu nda alliance success
Recent Comments
Leave a Comment

Related News