స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసే స్థానాలు ఖరారయ్యాయి. ప్రధానంగా మునిసిపల్ కార్పొరేషన్ స్థానాలపై టీడీపీ-జనసేన మధ్య తీవ్రస్థాయిలో చర్చలు జరిగాయి. దాదాపు రెండు నెలలుగా చేసిన కసరత్తులు.. ఎట్టకేలకు గత(గురువారం) రాత్రి ఒక కొలిక్కి వచ్చాయి.ఈ క్రమంలో జనసేనకు 4 కార్పొరేషన్ సీట్లతోపాటు.. మునిసిపాలిటీలను 21 స్థానాలను కేటాయించారు. దీంతో ఇప్పటి వరకు నెలకొన్న సందిగ్ధతలకు తెరపడినట్టు అయింది.
ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ హాట్గా మారిన వ్యవహారం కొలిక్కి రావడం.. ఆశించిన మేరకు సీట్లు కూడా దక్కడంతో జనసేన వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో మాదిరిగానే ఇప్పుడు సీట్లు కేటాయిస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ.. దానికి దాదాపు 5 శాతానికి ఎక్కువగానే సీట్లను కేటాయించారు. గత ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు కేటాయించారు. ఈ దఫా ఈ సంఖ్య కొంత మెరుగు పడింది. పైగా.. కూటమి పార్టీల్లో పోటీ ఎక్కువగా ఉండడంతో సర్దుబాటు జరగడం ఒకింత ఆలస్యమైందన్నది వాస్తవం.
ఇవీ.. స్థానాలు.. జనసేన మేయర్ గా పోటీ చేసే కార్పొరేషన్ల విషయానికి వస్తే.. శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజ యవాడలు ఉన్నాయి. ఇవి.. ఆ పార్టీకే కాకుండా.. రాష్ట్రంలోనూ కీలకమైన కార్పొరేషన్ స్థానాలనే చెప్పాలి. విజయ వాడను గత ఎన్నికల్లో వైసీపీ దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సీటును జనసేనకు కేటాయించ డంతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధాకృష్ణకు అవకాశం ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోం ది. ఈ పరిణామం.. కాపుల్లోనూ జనసేనలోనూ సంతోషం నింపనుంది.
ఇక, మిగిలిన స్థానాల్లో ఎవరిని నిలబెడతారన్నది చూడాలి.ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేశారని ప్రచారం జరుగుతున్నా.. కసరత్తు కొలిక్కిరాలేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో 21 మునిసిపాలిటీలను దక్కించుకున్న వ్యవహారం కూడా.. పార్టీలో సంతోషానికి దారితీస్తోంది. అయితే.. ఎన్ని సీట్లు దక్కించుకున్నా మన్నది కాకుండా.. అన్నీ గెలిచి తీరాలన్న సంకల్పంతో జనసేన ఉండడం గమనార్హం. గత ఎన్నికల్లో వచ్చిన 100 శాతం స్ట్రయిక్ రేట్ ఇప్పుడు కూడా తెచ్చుకోవడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది.