కేంద్ర ఎన్నికల సంఘంపై వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో కాక్రోచ్ జనతాపార్టీకి వైసీపీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని పట్టుబడు తున్నారు. ఈ విషయంపై తాజాగా ఆదివారం స్పందించిన జగన్.. సంచలన కామెంట్లు చేశారు. గతంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు పార్లమెంటు చేసిన చట్టానికితాము మద్దతు ఇచ్చామని తెలిపారు.
దానివల్లే.. తప్పులు జరిగాయని, ఆ తప్పు చేశాం కాబట్టే.. ఇప్పుడు అసలు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధిం చిన చట్టాన్ని మార్చాలని.. విధానాలను కూడా సరిచేయాలని కోరుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. అదేసమ యంలో కేంద్ర ఎన్నికల సంఘంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో చేసిన చట్టంలో లోపాలుఉన్నాయని తెలిపారు. వాటిని సరిచేయాలని తాము కోరుతున్నట్టు చెప్పారు. ``తప్పు చేశాం కాబట్టే.. ఇప్పుడు సరిచేయాలని కోరుతున్నాం. దీనిలో ఎలాంటి తప్పూలేదు.`` అని జగన్ వ్యాఖ్యానించారు.
అప్పట్లో ఏం జరిగింది?
కేంద్ర ఎన్నికలసంఘాన్ని ఏర్పాటు చేసేందుకు 2023లో సుప్రీంకోర్టు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని కేంద్రా న్ని ఆదేశించింది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. కొత్తగా చట్టం చేసింది. దీని ప్రకారం ముగ్గురు కమిషనర్లను ఎంపిక చేసే కమిటీలో ప్రధాన మంత్రితోపాటు, ప్రధాన మంత్రి ఎంపిక చేసిన కేంద్ర కేబినెట్ మంత్రి, అలానే ప్రతిపక్ష నాయకుడు మాత్రమే ఉంటారు. దీని ప్రకారం చట్టం తయారైంది. అప్పట్లో ఈ విధానంపై కాంగ్రెస్ సహా.. అన్ని ప్రతిపక్షాలు పెదవి విరిచాయి.
అయితే.. అప్పట్లో అధికారంలో ఉన్న జగన్ కేంద్రానికి మద్దతు తెలిపారు. ఇప్పుడు అది తప్పని.. ఆయన చెబుతున్నారు. ముగ్గురు సభ్యుల కమిటీలో కేంద్ర ప్రభుత్వానికే ఆధిపత్యం ఉందని.. అలాంప్పుడు ఎన్నికల కమిషనర్లను పారదర్శకంగా ఎంపిక చేయడం సాధ్యమేనా? అనేది జగన్ ప్రశ్న. అయితే.. అప్పట్లోనూ ఈవిషయం చర్చకు వచ్చినప్పుడు జగన్ గుడ్డిగా సమర్థించి.. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత.. యూటర్న్ తీసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.