వైసీపీకి భారీ షాక్‌.. హైకోర్టు ఏమందంటే!

admin
Published by Admin — October 19, 2026 in Andhra
News Image

ఏపీ హైకోర్టు వైసీపీకి భారీ షాక్ ఇచ్చింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వేళ‌.. త‌మ అభ్య‌ర్థులు నామినేష‌న్ వేసేందుకు వీలు ప‌డ‌లేద‌ని.. అధి కార కూట‌మి పార్టీల నాయ‌కులు, పోలీసులు కూడా త‌మ వారిని అడ్డుకున్నార‌ని పేర్కొంటూ.. వైసీపీ హైకోర్టులో ఆదివారం మ‌ధ్యాహ్నం హౌస్ మోష‌న్ పిటిష‌న్లు దాఖ‌లు చేసింది. ఈ పిటిష‌న్‌లో త‌మ‌ను అడుగడుగునా అడ్డుకున్నార‌ని.. నామినేష‌న్లు వేసేందుకు బ‌య‌లు దేరిన వారిని కూడా హౌస్ అరెస్టులు చేశార‌ని పేర్కొన్నారు. పుంగ‌నూరు, రాయ‌చోటి, పులివెందుల‌, ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది.

ఈ నేప‌థ్యంలో నామినేష‌న్ల గ‌డువును పొడిగించాల‌ని.. ఆదివారం మ‌ధ్యాహ్నం 3గంట‌ల‌తో ముగిసిపోతున్న గ‌డువును సోమ‌వారం వ‌ర‌కు పెంచాల‌ని వైసీపీ కోరింది. అంతేకాదు.. నామినేష‌న్లు వేసే త‌మ వారికి ఎస్పీ ఆధ్వ‌ర్యంలో బ‌ల‌మైన భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కూడా విన్న‌వించిం ది. ఈ పిటిష‌న్ల‌ను విచార‌ణ‌కు తీసుకున్న హైకోర్టు.. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల త‌ర్వాత‌(అప్ప‌టికే నామినేష‌న్ల గ‌డువు పూర్త‌యింది) విచార‌ణ చేప‌ట్టింది. సుదీర్ఘంగా 3 గంట‌ల పాటు సాగిన వాద‌న‌ల అనంత‌రం.. వైసీపీ దాఖ‌లు చేసిన నాలుగు హౌస్ మోష‌న్ పిటిష‌న్ల‌ను కూడా హైకోర్టు కొట్టి వేసింది. ఇప్ప‌టికే నామినేష‌న్ల గ‌డువు ముగిసింద‌ని.. ఎన్నిక‌ల సంఘం విధుల్లో తాము జోక్యం చేసుకునేది లేద‌ని పేర్కొంది.

అంతేకాదు.. నామినేష‌న్ల‌ను అడ్డుకున్నార‌న్న వాద‌న‌ను కూడా నిరూపించ‌లేక పోయార‌ని పేర్కొంది. ఇక‌, రాయ‌చోటి, పుంగ‌నూరుల్లో శుక్ర‌వారం ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్నా.. వాటికి-నామినేష‌న్ల దాఖ‌లుకు సంబంధం లేద‌న్న ఎన్నిక‌ల సంఘం వాద‌న‌ల‌తో ఏకీభ‌వించింది. అంతేకాదు.. అభ్య‌ర్థుల‌కు ఈ-మెయిల్ సౌక‌ర్యం కూడా క‌ల్పించామ‌ని.. ఈమెయిల్ రూపంలోనూ నామినేష‌న్లు దాఖ‌లు చేస్తే.. వాటిని ప‌రిశీలిస్తున్నామ‌ని.. సుమారు 50 మంది వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఈ-మెయిల్ రూపంలో నామినేష‌న్లు దాఖ‌లు చేశార‌ని హైకోర్టు కు వివ‌రించింది. కానీ, వైసీపీ ఈ సౌక‌ర్యాన్ని వినియోగించుకోలేద‌ని పేర్కొంది.

ఈ అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న న్యాయ‌స్థానం.. ``మీరు ఈ-మెయిల్ సౌక‌ర్యాన్ని ఎందుకు వినియోగించుకోలేదు.`` అని వ్యాఖ్యానించింది. ఎన్నిక‌ల సంఘం ఒక‌సారి షెడ్యూల్ ఖ‌రారు చేసిన త‌ర్వాత దీనిలో జోక్యం చేసుకుని మార్పులు చేయ‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది. ఈ నేప‌థ్యంలో వైసీపీ పిటిష‌న్ల‌ను ర‌ద్దుచేసింది. ఇక‌, ఎన్నిక‌ల ప్ర‌చారం చేసుకునే విష‌యంలో మాత్రం వైసీపీ అభ్య‌ర్థుల‌కు పోలీసులు భ‌ద్ర‌త‌ను క‌ల్పించాల‌ని.. గ‌తంలో డీజీపీ ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించాల‌ని హైకోర్టు సూచించింది.

Tags
Ycp Big jolt High court Municipal poles
Recent Comments
Leave a Comment

Related News