ఆ విషయంలోనూ వైసీపీకి చుక్కెదురే!

admin
Published by Admin — October 20, 2026 in Andhra
News Image

వైసీపీకి దెబ్బ‌పై దెబ్బ త‌గులుతోంది. స్థానిక ఎన్నిక‌ల్లో త‌మ‌ను నామినేష‌న్లు వేయ‌నీయ‌లేద‌ని చెబుతున్న ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌.. వేసిన వాటిని పాస్ చేయించుకునే విష‌యంలోనూ విఫ‌ల‌మ‌య్యాయి. చిన్న‌పాటి అజాగ్ర‌త్త‌, ముందస్తు దిశానిర్దేశం.. ప్ర‌ణాళిక కొర‌వ‌డిన ఫ‌లితంగా వైసీపీ త‌ర‌ఫున ప‌లు మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లో అభ్య‌ర్థులు వేసిన నామినేష‌న్లు తాజాగా తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యాయి. ఏపీ ఎన్నిక‌ల సంఘం.. సోమ‌వారం రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు కూడా నామినేష‌న్ల ప‌రిశీల‌న‌ను కొన‌సాగించింది. ఈ క్ర‌మంలో వైసీపీకి చెందిన చాలా మంది అభ్య‌ర్థుల నామినేష‌న్ల‌ను అధికారులు తిర‌స్క‌రించారు. ఈ తిర‌స్కృతిలో టీడీపీ అభ్య‌ర్థులు కూడా ఉండడం గ‌మ‌నార్హం.

అనేక పొర‌పాట్లు..

+ తాడిపత్రిలో వైసీపీకి భారీ షాక్.. త‌గిలింద‌నే చెప్పాలి. కనీస వివరాలు కూడా నింప‌కుండా..కేవ‌లం అభ్య‌ర్థి పేరుతో దాఖ‌లు చేసిన వైసీపీ అభ్యర్థుల నామినేష‌న్ల‌ను అధికారులు తిర‌స్క‌రించారు. వీటిలో 21 నామినేషన్లు తిరస్కరణకు గుర‌య్యారు. ఇక‌, ఇప్పటికే 5 వార్డుల్లో వైసీపీ నాయ‌కులు నామినేషన్ వేయలేదు. దీంతో మొత్తం 26 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యే అవ‌కాశం ఉంది.

+ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో అస‌లు వైసీపీ నాయ‌కులు నామినేష‌న్లే వేయ‌లేదు. దీంతో మూడు మున్సిపాలిటీలు టీడీపీ ఏకగ్రీవం అయ్యాయి. ముగ్గురు చైర్మన్లతో పాటు 91 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవం కానున్నార‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. ఒక‌టి రెండు చోట్ల వైసీపీ నేత‌లు నామినేష‌న్లు వేసినా.. వాటికి సంబంధించి లోపాలు క‌నిపించ‌డంతో అధికారులు తిరస్క‌రించారు.

+ జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోని కీల‌క‌మైన ప్రొద్దుటూరు మునిసిపాలిటీలోనూ వైసీపీ అభ్య‌ర్థి నామినేష‌న్ తిర‌స్క‌రించారు. నామినేష‌న్ ప‌త్రంలో ఆస్తుల‌ను, కేసులను వివ‌రించ‌లేద‌ని పేర్కొన్నారు. అయితే.. త‌న‌పై ఎలాంటి కేసులు లేవ‌ని వైసీపీ అభ్య‌ర్థి పోరెడ్డి నరసింహారెడ్డి చెప్ప‌గా.. అధికారులు కుద‌ర‌ద‌ని పేర్కొన్నారు. లిఖిత పూర్వ‌కంగా ఎస్పీ నుంచి లేఖ తీసుకురావాల‌ని పేర్కొన్నారు. కానీ, సాధ్యంకాలేదు. దీంతో నామినేష‌న్ తిర‌స్క‌రించారు.

+ నామినేష‌న్ల తొలిరోజు అల్ల‌ర్ల‌తో అట్టుడికిన రాజంపేట మున్సిపాలిటీలో వైసీపీ అభ్య‌ర్థి దాఖ‌లు చేసిన నామినేష‌న్ల‌ను అధికారులు తిరస్క‌రిం చారు. దీంతో ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఉన్న టీడీపీ నాయ‌కురాలు దొంతం గాయత్రి విజ‌యం ద‌క్కించుకున్న‌ట్టు అయింది. రాజంపేట ఛైర్‌పర్స న్‌ అభ్యర్థులుగా వైసీపీ నుంచి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. కానీ, అధికారులు తిర‌స్క‌రించారు.

+ ఇక‌, సెల్ఫ్ డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌లేద‌న్న కార‌ణంగా వైసీపీ అభ్య‌ర్థి నామినేష‌న్‌ను క‌నిగిరి మునిసిపాలిటీలో తిర‌స్క‌రించారు. ఫ‌లితంగా ఇది కూడా టీడీపీకే ద‌క్క‌తుంద‌ని అంటున్నారు.

+ ఆస్తిప‌న్ను బ‌కాయి ఉంద‌న్న కార‌ణంగా కూడా నామినేష‌న్ తిర‌స్క‌రించిన ఘ‌ట‌న అమ‌లాపురంలో జ‌రిగింది.ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్థి చంద్ర‌శేఖ‌ర్ స్థానిక మునిసిపాలిటీకి 60 వేల రూపాయ‌ల‌కు పైగానే ప‌న్నులు క‌ట్టాల్సి ఉంది. దీనిని దాచి పెట్టిన ఆయ‌న‌.. నామినేష‌న్ దాఖ‌లు చేయ‌గా.. అధికారులు తిర‌స్క‌రించారు.  

జ‌న‌సేన‌లో..

మడకశిర మునిసిపాలిటీలో జనసేన అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరించారు. ఛైర్మన్‌ అభ్యర్థిగా నామినేష‌న్ వేసిన‌ ఎస్‌ఈ శ్రీనివాసులు ద‌ర‌ఖాస్తును పూర్తిగా భ‌ర్తీ చేయ‌లేదు. దీంతో అధికారులు తిర‌స్క‌రించిన‌ట్టు ప్ర‌క‌టించారు. 

Tags
ycp candidates nominations rejected AP Local Body Elections
Recent Comments
Leave a Comment

Related News