మున్సిపల్ ఎన్నికల రీ షెడ్యూల్ ఇదే!

admin
Published by Admin — October 22, 2026 in Andhra
News Image

ఏపీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన విడుదల చేసింది. పోలింగ్ తేదీని నవంబర్ 1 కి మార్చింది. 19 స్థానాల్లో నామినేషన్ల గడువు పొడిగించాలని వైసీపీ కోరగా నాలుగు స్థానాలలో మాత్రమే గడువును 48 గంటల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఏపీలో జ‌రుగుతున్న స్థానిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌రుగుతున్న వివాదాలు, ఘ‌ర్ష‌ణ‌లు ఎలా ఉన్నా.. మ‌రోవైపు అభ్య‌ర్థుల నామినేష‌న్ల తిర‌స్క‌ర‌ణ వ్య‌వ‌హారం కూడా రాజ‌కీయంగా సెగ పెంచుతోంది. స్థానిక సంస్థ‌లు స‌హా ... ప్ర‌స్తుతం ప్రారంభ‌మైన ఎంపీటీసీ, జ‌డ్‌పీటీసీ ఎన్నిక‌ల నామినేషన్ల ఘ‌ట్టం కూడా.. కొన్ని కార‌ణాల‌తో వివాద‌మైంది. ముఖ్యంగా పోటీ చేయాల‌ని భావించే అభ్య‌ర్థులు.. త‌మ నామినేష‌న్ల‌తో పాటు వారికి ఎలాంటి బ‌కాయిలు లేవ‌ని ధ్రువీక‌రిస్తూ.. ఇచ్చే న్యోడ్యూస్‌, అదేవిధంగా పోలీసు కేసులు, విచార‌ణ‌లు ఏవీ లేవ‌ని పేర్కొంటూ ఇచ్చే ఎన్ వోసీ స‌ర్టిఫికెట్లు కూడా కీల‌కం. ఇవి లేక‌పోతే.. నామినేష‌న్ల‌ను అస‌లు స్వీక‌రించ‌రు.

ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జ‌డ్‌పీటీసీ ఎన్నిక‌ల నామినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. దీంతో వైసీపీ నాయ‌కులు.. పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగారు. దీనికి కార‌ణం.. త‌మ‌కు ఎన్‌వోసీలు,నో డ్యూస్ స‌ర్టిఫికెట్లు ఇవ్వ‌డం లేద‌నే. ఈ వ్య‌వ‌హారంపై తాజాగా రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం స్పందించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న విధానాన్ని ప‌క్క‌న పెడుతూ.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నికల కు నామినేష‌న్ దాఖ‌లు చేసేవారు.. నో డ్యూస్‌, ఎన్‌వోసీలు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది. ఎలాంటి అనుబంధ ప‌త్రాలు ఇవ్వ‌క‌పో యినా.. నామినేష‌న్లు స్వీక‌రించాల‌ని అధికారుల‌ను ఆదేశించింది.

అస‌లు అవ‌స‌రం లేదా?

అయితే.. ఈ ఎన్ వోసీ, నో డ్యూస్ ప‌త్రాలు అవ‌స‌రం ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదా? అంటే.. నిబంధ‌న‌ల మేర‌కు ఇవ్వాల్సిందే. అయితే.. నామినేష‌న్ల గ‌డువు త‌క్కువ‌గా ఉండ‌డం.. అధికారులు కూడా తీరిక లేకుండా ప‌నుల్లో ఉండ‌డంతో ఈ ప‌త్రాలు ఇవ్వ‌డం సాధ్యం కావ‌డం లేద‌ని క‌లెక్ట‌ర్లు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల సంఘం కొంత రిలాక్సేష‌న్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఆయా ప‌త్రాలు లేక‌పోయినా.. నామినేష‌న్లు తీసుకుంటారు. అయితే.. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. అభ్యర్థులు విజ‌యం ద‌క్కించుకున్న త‌ర్వాత‌.. ఖ‌చ్చితంగా వాటిని ఇవ్వాల్సి ఉంటుంది. అప్ప‌టి వ‌ర‌కు గెలుపొందిన అభ్య‌ర్థికి ఇచ్చే స‌ర్టిఫికెట్‌ను ఇవ్వ‌రు.

ఒక‌వేళ ఈ ప‌త్రాల్లో ఏది ల‌భించ‌క‌పోయినా.. ఏం జ‌రుగుతుంది? అప్పుడు విజ‌యం ద‌క్కించుకున్న అభ్య‌ర్థిని ప‌క్క‌న పెడ‌తారా? అనే విష‌యంపై స్ప‌ష్టత రావాల్సి ఉంది. కాగా.. ప్ర‌స్తుతం ఇచ్చిన రిలాక్సేష‌న్‌తో తాజాగా జ‌రుగుతున్న వివాదాల‌కు, ఆందోళ‌న‌ల‌కు కొంత మేర‌కు చెక్ ప‌డుతుంద‌ని ఎన్నిక‌ల సంఘం భావిస్తోంది.

అంతేకాదు.. ప్ర‌స్తుత‌నామినేష‌న్ల ప‌ర్వం కూడా స‌జావుగా సాగుతుంద‌ని ఎన్నిక‌ల సంఘం అంచ‌నా వేస్తోంది. అందుకే.. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా నో డ్యూస్‌, ఎన్‌వోసీ వంటి కీలక ప‌త్రాలు లేక‌పోయినా నామినేష‌న్లు వేసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తూ.. కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Tags
Ap Sec puneta ap municipal elections Polling date post poned
Recent Comments
Leave a Comment

Related News