శుభమా అని వివాహం జరుగుతున్న ఇంట.. ఆ తల్లి కన్నీరు పెడుతోంది. తోడబుట్టిన సోదరుడు.. కనికరం అనేది కూడా లేకుండా వ్యవహరిస్తున్నతీరుతో మానసికంగా కుమిలిపోతోంది. ``ఇదేనా అన్నా..నీ అనురాగం`` అని ప్రశ్నిస్తోంది. ఆమే ఏపీసీసీ అధ్యక్షురాలు.. మాజీ సీఎం జగన్‌కు స్వయానా సోదరి షర్మిల. తాజాగా తన బాధను వ్యక్తం చేస్తూ.. షర్మిల రాసిన లేఖ(ఎక్స్‌లో) ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తూ.. `` చెల్లి కంటతడి.. కలిసి వస్తుందా జగన్`` అని ప్రశ్నిస్తున్నారు.
తాజాగా రాసిన ఎక్స్ లేఖలో షర్మిల.. కీలక విషయాలను వెల్లడించారు. కర్ణాటకలోని యలహంకలో ఉన్న ప్రాపర్టీ పూర్తిగా తనకే చెందినదని.. దీనిలో వైఎస్ రాజశేఖరరెడ్డి నడయాడారని పేర్కొన్నారు. ఇక్కడే అంజలి(పెళ్లి కుమా ర్తె) కూడా చిన్నప్పటి నుంచి తిరిగిందని తెలిపారు. తాను నడిచిన చోటే.. తాను.. తాతతో కలిసి అడుగులు వేసిన చోటే.. పెళ్లి చేసుకోవాలని అంజలి ఎన్నో కలలు కన్నదని ఆమె పేర్కొన్నారు. కానీ, అకస్మాత్తుగా సొంత మేనమామ (జగన్) అడ్డు పడడంతో అంజలి కన్నీరుమున్నీరు అయిందని తెలిపారు.
ఇంతగా తమను బాధపెట్టిన చోట పెళ్లి చేయడం కూడా ఇబ్బందిగానే ఉందని.. అందుకే వేరే ప్రాంతాన్ని ఎంచుకు న్నట్టు షర్మిల తన లేఖలో పేర్కొన్నారు. మొత్తంగా ఈ ఆస్తి మొత్తం తనదేనని షర్మిల పేర్కొన్నారు. అయినప్పటికీ జగన్ అడ్డంకులు సృష్టిస్తూ.. భద్రత పేరుతో అడ్డుకుంటున్నారని.. షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల తో తన కుటుంబం బాధలో ఉందన్నారు. ఈ లేఖపై నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బద్ధ శత్రువులు కూడా ఇలాంటి విషయాల్లో సహకరించుకుంటారని.. కానీ, షర్మిల విషయంలో జగన్ అనుసరిస్తున్న తీరు.. తీవ్ర వివాదం గా మారింది.