ఆ మాటతో జగన్ కు కేటీఆర్ షాక్!

admin
Published by Admin — October 30, 2026 in Andhra
News Image

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు. ``విజ‌న్ అంటే మీదే.. చంద్ర‌బాబు గారూ`` అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే అదేస‌మ‌యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై విమ‌ర్శ‌లుగుప్పించారు. ``ఆయ‌న‌ను చూసి రేవంత్ రెడ్డి ర‌వ్వంతైనా నేర్చుకోలేదు.`` అని పెద‌వి విరిచారు. దీనికి కార‌ణం.. ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని స‌గానికి పైగా జిల్లాల్లో నెల‌కొన్న క‌రువు ప‌రిస్థితే కార‌ణం. ఏపీలో వ్య‌వ‌సాయంపై ఎలాంటి ఆంక్ష‌లు లేక‌పోవ‌డం, నీరు వ‌దులుతున్న తీరును కేటీఆర్ ప్ర‌శంసించారు. ఈ ఒక్క మాటతో జగన్ కు కేటీఆర్ షాక్ ఇచ్చినట్లయింది.

చంద్ర‌బాబు ముందు చూపుతో నీటి విష‌యంలో మంచిగా ఆలోచ‌న చేశార‌ని అన్నారు. అందుకే.. ఏపీలో క‌రువు లేద‌ని పైగా వ్య‌వ‌సాయానికి సంబంధించిన ఎలాంటి ఆంక్ష‌లు కూడా పెట్ట‌లేద‌ని కేటీఆర్ అన్నారు. క్రాప్ హాలిడే వంటివి కూడా ఏపీలో లేవ‌న్నారు. ఈ విష‌యంలో ముందుగానే ఆలోచ‌న చేసిన చంద్ర‌బాబు.. తెలంగాణ నుంచి శుభ్రంగా నీటిని ఎత్తి పోసుకున్నార‌ని అన్నారు. ఇంత జ‌రుగుతున్నా.. తెలంగాణ ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రించింద‌ని ఎద్దేవా చేశారు.

నిజానికి తెలంగాణ‌లో కంటే కూడా.. ఏపీలోనే లోటు వ‌ర్ష‌పాతం ఎక్కువ‌గా ఉంద‌ని కేటీఆర్ చెప్పారు. అయిన‌ప్ప‌టి కీ.. అక్క‌డ స‌మృద్ధిగా నీరు ల‌భ్య‌త ఉంద‌న్నారు. తెలంగాణ‌లో మాత్రం క‌రువు ఉంద‌ని క్రాప్ హాలిడే ప్ర‌క‌టించార‌ని అన్నారు. రైతుల‌ను రెండో పంట వేయొద్ద‌ని సీఎం రేవంత్ రెడ్డి స్వ‌యంగా చెప్పార‌ని తెలిపారు. రేవంత్ అనుస రించిన వైఖ‌రి కార‌ణంగానే తెలంగాణ‌లో క‌రువు నెల‌కొంద‌ని చెప్పారు. ఒక‌వైపు క‌రువులో ఉన్నామ‌ని చెబుతూ.. మూసీ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు ఎందుకు చేప‌డుతున్నార‌ని ప్ర‌శ్నించారు.

రాహుల్ స్పందించాలి!

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌ను ఆ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గ‌మ‌నించ‌డం లేదా? అని కేటీఆర్‌ ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికైనా తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌ను నిలిపివేసేలా ఆయ‌న జోక్యం చేసుకోవాల‌న్నా రు. మూసీ సుంద‌రీ క‌ర‌ణ పేరులో ల‌క్షల కోట్ల రూపాయ‌ల దోపిడీకి తెర‌దీశార‌ని విమ‌ర్శించారు. ఇలాంటి ప‌రిస్థితిని చూసీ చూడ‌నట్టు రాహుల్ వ‌దిలేస్తున్నార‌ని విమ‌ర్శించారు. క‌రువు ప్ర‌భావిత జిల్లాల‌ను ఆదుకునేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి మాస్ట‌ర్ ప్లాన్ ప్ర‌క‌టించ‌లేద‌ని అన్నారు.

Tags
Ktr praises cm chandrababu water management
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News