విజ‌య్ తో బ్రేక‌ప్‌.. ప్రేమించే వాడ్ని తెలివిగా ఎంచుకోవాలంటున్న‌ త‌మ‌న్నా!

admin
Published by Admin — March 07, 2025 in Movies
News Image

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, బాలీవుడ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ బ్రేక‌ప్ చెప్పుకున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. రెండేళ్ల నుంచి పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగితేలుతున్న ఈ జంట ప‌రస్ప‌ర అంగీకారంతో విడిపోయార‌ని.. ఇక‌పై స్నేహితులుగా కొన‌సాగాల‌ని నిర్ణయించుకున్నార‌నే వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఇలాంటి స‌మ‌యంలో ఓ పాడ్‌కాస్ట్‌కు హాజ‌రైన త‌మ‌న్నా.. ప్రేమ‌, రిలేష‌న్‌షిప్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

`ప్రేమ అంటే ఏంటి? రిలేష‌న్‌షిప్ అంటే ఏంటి? అనే దానిపై ప్రజలు ఎప్పుడూ గందరగోళానికి గురవుతార‌ని ఇటీవ‌లె గ్ర‌హించాను. ప్రేమ పుట్టాక రిలేష‌న్‌షిప్ స్టార్ట్ అవుతుంది. షరతులు వ‌చ్చే క్షణం నుండి ప్రేమ నిలిచిపోతుందని నేను భావిస్తున్నాను. ప్రేమ అనేది ఒక వ్యక్తి మరొక వ్యక్తి పట్ల అనుభూతి చెందగల అంత‌ర్గ‌త విషయం. ప్రేమ ఏకపక్షంగా కూడా ఉండొచ్చు. కానీ ప్రేమ ష‌ర‌త‌లు లేకుండా ఉండాలి` అని త‌మ‌న్నా పేర్కొంది.

`ఎప్పుడైతే పార్ట్‌న‌ర్‌పై అంచ‌నాలు పెంచుకోవ‌డం ప్రారంభిస్తావో అప్పుడు ఆ రిలేష‌న్‌షిప్ బిజినెస్‌గా మారిపోతుంది. నేను ఎవ‌రినైనా ప్రేమిస్తే వారిని స్వేచ్చ‌గా వ‌దిలేస్తాను. వారికి న‌చ్చిన‌ట్లు ఉండేలా ప్రోత్స‌హిస్తాను. ప్రజలు నిరంతరం పరిణామం చెందుతారు. ఒకరిని ప్రేమించడం అంటే కాలక్రమేణా వారి మారుతున్న వెర్షన్‌లను స్వీక‌రించాలి.` అని త‌మన్నా తెలిపింది.

ఇక తాను ఒంటిరిగా కంటే రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌ప్పుడే ఎక్కువ సంతోషంగా ఉన్నాన‌ని.. కానీ, ప్రేమించేవాడిని కొంచెం తెలివిగా ఎంపిక చేసుకోవాల‌ని, ఎందుకంటే వారు మీ లైఫ్ ను ప్రభావితం చేసే అవ‌కాశం ఉందని ఈ సంద‌ర్భంగా త‌మ‌న్నా సూచించింది. ఎక్క‌డా విజ‌య్ వ‌ర్మ పేరును ప్ర‌స్తావించ‌కుండా త‌మ‌న్నా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Recent Comments
Leave a Comment

Related News