అసెంబ్లీ లో ర‌ఘురామ క‌ల నెర‌వేరేనా?

admin
Published by Admin — February 10, 2025 in Politics
News Image

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాల‌కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 24వ తేదీ నుంచి బ‌డ్జెట్ స‌మా వేశాలు ప్రారంభిస్తున్న‌ట్టు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఎస్‌. అబ్దుల్ న‌జీర్ పేరుతో గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం తాజాగా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ స‌మావేశాల తొలి రోజు గ‌వ‌ర్న‌ర్ ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ నున్నారు. అనంత‌రం.. ఈ నెల 28 లేదా మార్చి 1న రాష్ట్ర వార్షిక(2025-26) బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్ట‌నున్నా రు. అయితే.. ఈ సారి స‌భ‌లు ఎన్ని రోజులు జ‌రుగుతాయ‌నేది 24వ తేదీ అసెంబ్లీ ప్రారంభ‌మైన త‌ర్వాతే తెలియ‌నుంది.

సాధార‌ణంగా.. స‌భ‌లు ప్రారంభం కావ‌డం.. ముగియ‌డం కామ‌నే. కానీ, ఏపీ అసెంబ్లీకి మాత్రం ఈ ప్ర‌త్యేక‌త ఎందుకు వ‌చ్చిందంటే.. వైసీపీ అధినేత‌, విప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్ ఈ సారైనా స‌భ‌కు వ‌స్తారా? అనేది కూట‌మి నాయ‌కులు, ఈ సారైనా త‌మ నాయ‌కుడు త‌మ‌ను అనుమ‌తిస్తారా? స‌భ‌కు వెళ్లి అధ్య‌క్షా అనేం దుకు అవ‌కాశం ఉంటుందా? అని వైసీపీ నాయ‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు స‌భ‌లు జ‌రిగినా.. జ‌గ‌న్ రెండు సార్లు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు.

తొలిసారి ప్ర‌మాణం చేసేందుకు, త‌ర్వాత‌.. గ‌వ‌ర్న‌ర్ ప్రసంగం రోజు(అప్పుడు ఇంటీరియం బ‌డ్జెట్ స‌మావే శాలు) ఆయ‌న హాజ‌రై.. బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఇక‌, ఆ త‌ర్వాత జ‌గ‌న్ అసెంబ్లీ మొహం కూడా చూడ‌లేదు. తాను అసెంబ్లీకి వెళ్లేంది లేద‌ని ఆయ‌న చెబుతున్నారు. త‌న‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాల‌ని.. సీఎం చంద్ర‌బాబుతో స‌మానంగా స‌భ‌లో మాట్లాడే స‌మ‌యం కూడా ఇవ్వాల‌ని జ‌గ‌న్ కోరుతున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ వైఖ‌రిపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మైన విష‌యం తెలిసిందే.

ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ ఖ‌చ్చితంగా వెళ్తార‌న్న చ‌ర్చ కూడా వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల డిప్యూటీ సీఎం ర‌ఘురామ‌.. 60 రోజులు స‌భ జ‌రిగితే.. వ‌రుస‌గా నాలుగు రోజులు జ‌గ‌న్ స‌భ‌కు రాక‌పోతే.. ఆయ‌న ఎమ్మెల్యే సీటును ఖాళీ అయిందిగా ప్ర‌క‌టిస్తామ‌ని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో జ‌గ‌న్ ఈ ద‌ఫా స‌భ‌కు వ‌స్తార‌ని కూటమి నాయ‌కులు చెబుతున్నారు. కానీ, 60 రోజుల పాటు స‌భ సాగ‌నందున‌.. ఇప్పుడు త‌మ‌కు ఇబ్బంది లేద‌ని.. వైసీపీ ముఖ్య నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.

వాస్త‌వ లెక్క చూస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు.. 28 రోజులు పాటు స‌భ జ‌రిగింది. ఇప్పుడు జ‌ర‌గ‌బోయే స‌భ క‌నుక‌.. 32 రోజుల పాటు నిర్వ‌హిస్తే.. అప్పుడు కూడా జ‌గ‌న్ రాక‌పోతే.. అప్పుడు ర‌ఘురామ క‌ల నెర‌వేరే అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News