రెండు రోజుల కిందట.. జాతీయ మీడియా ప్రతినిధి రాజ్‌దీప్ సర్దేశాయ్.. సీఎం చంద్రబాబు కేంద్రంగా చేసిన వ్యాఖ్యలు.. పెద్దగా వర్కవుట్ అవలేదు. పైగా.. ఇవి ఆయనను ప్రోద్బలానికి గురి చేసిన, ,చంద్ర బాబుపై అస్త్రాన్ని రువ్విన వైసీపీకి బూమరాంగ్‌గా మారాయి. ఏ ఎండకు ఆ గొడుగు పడతారంటూ.. చంద్ర బాబుపై రాజ్‌దీప్ విమర్శలు చేశారు. ఒకింత కఠిన వ్యాఖ్యలే చేశారని చెప్పాలి. కానీ.. వాస్తవానికి.. రాజకీయాల్లో ఉన్న వారు చేసేది అంతే!
తెలంగాణ నుంచి ఏపీ వరకు.. ఆ మాటకు వస్తే.. వైసీపీ దాకా కూడా.. ఏ ఎండకు ఆ గొడుగు పడుతూనే ఉన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును తమవైపు తిప్పుకొనే క్రమంలో జగన్ కూడా.. ఆ బాపతు రాజకీయాలే చేశారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టినప్పుడు.. జగన్ అనుకూలంగా వ్యవ హరించిన విషయాన్ని ఈ సందర్భంగా రాజ్‌దీప్ మరిచిపోయి ఉండొచ్చు. ఇక, ప్రతిపక్షంలో ఉన్నప్పు డు.. ప్రత్యేక హోదా కోసం.. రంకెలు వేసిన వైసీపీ నాయకులు.. తర్వాత.. మోడీతో కుమ్మక్కు రాజకీయాలు చేశారు.
మరి దీనిని ఎలా చూడాలి. రాష్ట్రంలో 22 మంది లోక్‌సభ సభ్యులు ఉండి కూడా..కేంద్రం నుంచి పోలవ రానికి నిధులు సమకూర్చుకోలేక పోయిన దుస్థితిని రాజ్‌దీప్ ఎవరికి అంటగడతారు? ఇక, మోడీని తిట్టి పోసి.. తర్వాత.. ఆయన చెంతకే చేరారని.. చంద్రబాబుపై మరో విమర్శనాస్త్రాన్ని విసిరారు. కానీ, వాస్తవం, ఏంటంటే.. రాజకీయ అవసరాల కోసం.. బీజేపీ నే చంద్రబాబుతో జత కట్టింది. నిజానికి చంద్రబాబు ముందున్న లక్ష్యం సిద్ధాంత కాదు. కానీ.. బీజేపీకి సిద్ధాంత రాజకీయాలు ఉన్నాయి.
ఈ విధంగా చూసుకున్నప్పుడు బీజేపీనే తన సిద్ధాంతాలను పక్కన పెట్టి మరీ చంద్రబాబు కోసం ముందు కు వచ్చింది. దీనికి కారణం.. దక్షిణాదిలో బలమైన పార్టీని తనవైపు తిప్పుకోవడం ద్వారా.. వ్యూహాత్మకంగా ఎదగాలన్న వుద్దేశమే. సో.. సర్దేశాయ్.. చంద్రబాబుపై చేసిన ప్రతి విమర్శ వెనుకా.. వైసీపీకి ఆయన ఏదో మేలు చేయాలన్న వ్యూహమే తప్ప.. వాస్తవాలు మనకు కనిపించవు. ఎందుకంటే.. తప్పు చేసింది.. ఎవరైనా ఉంటే.. అది రాజకీయం!
ఎవరైనా.. అవసరాలు-అవకాశాల కోసమే రాజకీయాల్లో పరుగులు పెడతారు. ఇప్పుడు కోరివస్తే.. బీజేపీని కౌగిలించుకునేందుకు వైసీపీ మాత్రం సిద్ధంగా ఉండదా? అంతెందుకు అంతర్గత రాజకీయ ఒడంబడికలు లేకుండానే నత్వానీకి రాజ్యసభ సీటును జగన్ ఆఫర్ చేశారా? ఏదేమైనా.. సర్దేశాయ్‌కు ఉప్పుతిన్న విశ్వాసం అయితే ఉండొచ్చు.. కానీ, దానిని ప్రజలపై రుద్దాలని ప్రయత్నం చేయడం సరికాదని మేధావులు చెబుతున్నారు.