జాన్వీ కి కానుక‌గా రూ. 5 కోట్ల కారు.. ఇచ్చిందెవ‌రు..?

admin
Published by Admin — April 12, 2025 in Movies
News Image

బాలీవుడ్ అందాల తార జాన్వీ క‌పూర్ తాజాగా రూ. 5 కోట్లు విలువ చేసే కారును కానుక‌గా అందుకుని వార్త‌ల్లో ట్రెండ్ అవుతోంది. బిర్లా వారసురాలు అనన్య బిర్లా అత్యంత విలాసవంతమైన పర్పుల్ కలర్ లంబోర్గిని కారును శుక్రవారం ఉదయం ముంబైలోని జాన్వీ ఇంటికి కానుక‌గా పంపి స‌ర్‌ప్రైజ్ చేశారు. అన‌న్య పంపిన కారులో మ‌రొక పెద్ద గిఫ్ట్ బాక్స్ కూడా ఉంది. దానిపై `ప్రేమతో, నీ అనన్య` అని రాసి ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు

అస‌లెవ‌రీ అన‌న్య బిర్లా.. బిజినెస్ టైకూన్ కుమార్ మంగ‌ళం – నీర‌జ బిర్లాల‌ కుమార్తెనే అన‌న్య‌. ఈమె ఎంట‌ర్‌ప్రెన్యూర్ మ‌రియు సింగ‌ర్ కూడా. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్లలో అన‌న్య ఒకరు. అలాగే 17 ఏళ్ల వయసులోనే ఇండిపెండెంట్ మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తన తొలి సంస్థను స్థాపించారు. ఇటీవ‌లె ఒక మేక‌ప్ బ్రాండ్ ను కూడా లాంచ్ చేశారు.

ఈ బ్రాండ్ కు అన‌న్య క్లోజ్ ఫ్రెండ్ మ‌రియు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ ప్ర‌చార‌క‌ర్త‌గా ఉండ‌నుంది. అందుకు కృత‌జ్ఞ‌త‌గా అన‌న్య లంబోర్గిని కారును జాన్వీకి బహుకరించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా, జాన్వీ కెరీర్ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ నార్త్‌తో పాటు సౌత్‌లో కూడా దూసుకుపోతుంది. `దేవ‌ర` చిత్రంతో కెరీర్ లో బిగ్ హిట్ అందుకున్న జాన్వీ ఇప్పుడు తెలుగులో రామ్ చ‌ర‌ణ్ కు జోడిగా బుచ్చిబాబు డైరెక్ష‌న్ లో `పెద్ది` సినిమా చేస్తోంది. అలాగే ఎన్టీఆర్ `దేవ‌ర 2` జాన్వీ లైన‌ప్‌లో ఉంది. అటు బాలీవుడ్‌లోనూ ప‌లు చిత్రాలు చేస్తూ బిజీ షెడ్యూల్ మెయింటైన్ చేస్తోంది.

కొట్టేస్తుంది.

Tags
Actress Janhvi Kapoor Ananya Birla bollywood
Recent Comments
Leave a Comment

Related News

Latest News