కందాళ బాట‌లో మంత్రి పొంగులేటి…!

admin
Published by Admin — May 07, 2025 in Politics, Telangana
News Image

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేంద‌ర్ రెడ్డి బాట‌లో న‌డుస్తున్నారు. పొంగులేటి పాలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి యేడాదిన్న‌ర అవుతోంది. పొంగులేటి ఎమ్మెల్యే అవ్వ‌డం.. వెంట‌నే రెవెన్యూ, గృహ‌నిర్మాణ‌, స‌మాచార శాఖాల మంత్రి అవ్వ‌డం జ‌రిగిపోయాయి. తాజాగా పొంగులేటి పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేంద‌ర్‌రెడ్డి బాట‌లో న‌డ‌వ‌డం స్టార్ట్ చేశారు. ఉపేంద‌ర్ రెడ్డి గ‌త ఐదేళ్లు పాలేరు ఎమ్మెల్యేగా ఉండ‌డంతో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో కంప్లీట్‌గా సేవా ధృక్ప‌థంతోనే ముందుకు వెళ్లారు. పార్టీ ర‌హితంగా నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు చ‌నిపోయినా త‌క్ష‌ణ‌మే మ‌ట్టిఖ‌ర్చులు.. ఇత‌ర‌త్రా సాయంగా రు. 10 వేలు పంపేవారు. దీనిని ఐదేళ్ల పాటు ఆయ‌న ఓ య‌జ్ఞంలా చేశారు. అలాగే నాలుగు మండ‌లాల్లో అన్ని గ్రామాల్లో ఎవ‌రు ఏ దేవాల‌యం, చ‌ర్చ్‌, మ‌సీదులు కొత్త‌గా నిర్మించుకున్నా దేవాల‌యం నిర్మాణం, బ‌ట్జెట్‌ను బ‌ట్టి రు. ల‌క్ష‌తో మొద‌లు పెట్టి రు. 10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉదారంగా సాయం చేసేవారు.

ఇక యేడాదిన్న‌ర త‌ర్వాత ఇప్పుడు పొంగులేటి కందాళ బాట‌లోనే మృతి చెందిన నిరుపేద కుటుంబాల‌కు ఆర్థిక సాయం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. మ‌రి పొంగులేటి కందాళ బాట‌లోనే నిరుపేద‌ల‌కు ద‌హ‌న సంస్కార‌ ఖ‌ర్చులు సాయం వ‌ర‌కే చేస్తారా ? అలాగే ఆయ‌న ఇచ్చిన‌ట్టుగానే దేవాల‌యాకు కూడా ఈ సాయం కంటిన్యూ చేస్తారా ? అన్న ప్ర‌శ్న‌లు పాలేరు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్నాయి. అయితే వ‌చ్చే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు మంత్రి పొంగులేటికి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కం. ఇప్ప‌టికే అటు ప్ర‌భుత్వంపై.. ఇటు ఖ‌మ్మం జిల్లాలోనూ అధికార పార్టీపై తీవ్ర వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. ఈ టైంలో స్థానిక ఎన్నికల్లో మంత్రులు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని గెలిపించ‌క‌పోతే వారి ప్ర‌తిష్ట‌కు పెద్ద ముప్పుగానే చెప్పాలి. అందుకే యేడాదిన్న‌ర వ‌ర‌కు ఈ త‌ర‌హా సాయాలు లేక‌పోయినా ఇప్పుడు తెర‌మీద‌కు తీసుకు వ‌స్తున్నారా ? అన్న ప్ర‌శ్న‌లు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు వ్య‌క్తం చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే పొంగులేటి ఈ త‌ర‌హా ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టార‌ని తెలియ‌డంతో ఉమ్మ‌డి జిల్లాలో మిగిలిన మంత్రులు.. కాంగ్రెస్ ప్ర‌జా ప్ర‌తినిధులు సైతం పొంగులేటి మ‌మ్మ‌ల‌ను ఇర‌కాటంలో ప‌డేశార‌ని అని గుస‌గుస‌లాడుకుంటున్నార‌ట‌.

ఏదేమైనా ఓ ఎమ్మెల్యే చేసిన మంచి ప‌ని చేయ‌డానికి మంత్రికి యేడాదిన్న‌ర ప‌ట్టింది… ఇది జిల్లాలో మిగిలిన మంత్రులు కూడా అనుక‌రిస్తే పేద కుటుంబాల‌కు ఆ దుఃఖంలో ఎంతో కొంత ధైర్యం ఇచ్చిన‌ట్ల‌వుతుంది. నాడు ప్ర‌జ‌ల సెంటిమెంట్‌ను.. భార‌తీయ సంస్కృతిని గౌర‌వించి ఓ ఎమ్మెల్యేగా ఉన్న కందాళ దేవాలయాలకు, మజీద్,

Tags
bhatti vikramarka Kandala Upender Reddy Ponguleti Srinivasa Reddy
Recent Comments
Leave a Comment

Related News