టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేరవకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటకు ఆన్ స్క్రీన్ పై ఎంతటి క్రేజ్ ఉందో ఆఫ్ స్క్రీన్‌లోనూ అంతే క్రేజ్ ఉంది. ఈ జంట తొలిసారి `గీత గోవిందం` చిత్రంలో నటించారు. 2018లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. విజయ్, రష్మిక కెరీర్లకు బూస్ట్ ఇచ్చింది. అదే సమయంలో వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత లవర్స్ అయ్యారు. ఫెస్టివల్స్ ను కలిసి సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా వెకేషన్స్, డిన్నర్ డేట్స్ అంటూ విజయ్, రష్మిక ఎప్పటికప్పుడు తమ రిలేషన్‌పై హింట్స్ ఇస్తూనే ఉన్నారు. వీరిద్దరూ రేపో మాపో పెళ్లి కూడా చేసుకోవడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో బలంగా ఉంది.
ఆ సంగతి పక్కన పెడితే.. వెండితెరపై విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి జంటగా అలరిబోతున్నారు. ఈ గుడ్ న్యూస్ ను రష్మిక ఆల్మోస్ట్ కన్ఫార్మ్ చేసింది. ప్రస్తుతం విజయ్ `కింగ్డమ్` అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మే 30న విడుదల కాబోతుంది. కింగ్డమ్ అనంతరం `టాక్సీవాలా`, `శ్యామ్ సింగరాయ్` వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తో విజయ్ దేరకొండ ఓ సినిమా చేయనున్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా ఓ హింట్ ఇచ్చింది. #HmmLetsSee అంటూ ఎక్సీ పేజీలో మైత్రీ వారు రష్మికను ట్యాగ్ చేశారు. అందుకు ఆమె `నిజమే గాయ్స్` అంటూ బదులిచ్చింది. #HmmLetsSee అంటే ఏంటో స్పష్టత రానప్పటికీ.. ఇందతా విజయ్, రష్మిక సినిమా గురించే అని సినీ ప్రియులు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.