ఆ స్టార్ హీరోకు విల‌న్‌గా రాజ‌శేఖ‌ర్.. కేక పెట్టిస్తున్న కాంబినేష‌న్‌..!

admin
Published by Admin — May 16, 2025 in Movies
News Image

టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన సీనియ‌ర్ స్టార్స్ లో రాజ‌శేఖ‌ర్ ఒక‌రు. ఆయ‌న తోటి హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంక‌టేష్‌, బాల‌కృష్ణ ఇప్ప‌టికీ హీరోలుగా స‌త్తా చాటుతున్నారు. స‌రైన ప్లానింగ్ లేక‌పోవ‌డంతో రాజ‌శేఖ‌ర్ తొంద‌ర‌గానే హీరోగా ఫేడౌట్ అయ్యారు. అయితే యాంగ్రీ యంగ్‌మాన్ గా ప్ర‌సిద్ధి చెందిన రాజ‌శేఖ‌ర్ ఇప్పుడు న్యూ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నారు. హీరో నుంచి విల‌న్ గా ట‌ర్న్ అవ్వ‌బోతున్నారు.

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ లైన‌ప్‌లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో `రౌడీ జ‌నార్ధ‌న్` ఒక‌టి. రాజావారు రాణి వారు ఫేం ర‌వి కిర‌ణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో విజ‌య్ ను ఢీ కొట్టే విల‌న్ క్యారెక్ట‌ర్ లో రాజ‌శేఖ‌ర్ ఎంపిక అయిన‌ట్లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే రాజ‌శేఖ‌ర్ తో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల సంప్ర‌దింపులు పూర్తి అయ్యాయ‌ట‌. హీరోతో స‌మానంగా విల‌న్ పాత్ర‌కు ప్ర‌ధాన్య‌త ఉండ‌టంతో ఆయ‌న వెంట‌నే ఓకే చెప్పార‌ని అంటున్నారు. ఇక తాజాగా రాజ‌శేఖ‌ర్ కు లుక్ టెస్ట్ ను నిర్వ‌హించ‌గా.. మూవీ యూనిట్ ను అన్ని విధాల ఆయ‌న లుక్ సంతృప్తి ప‌రిచింద‌ని స‌మాచారం. రౌడీ జ‌నార్ధ‌న్‌లో రాజ‌శేఖ‌ర్ ఆల్మోస్ట్ క‌న్ఫార్మ్ అయ్యార‌ని.. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ని బ‌లంగా టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఆన్ స్క్రీన్ పై విజ‌య్ దేవ‌ర‌కోండ‌, రాజ‌శేఖ‌ర్ కాంబినేష‌న్ కేక పెట్టిస్తుంది అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.

Tags
Latest news rajasekhar Rowdy Janardhan
Recent Comments
Leave a Comment

Related News

Latest News