పవన్ షూటింగ్.. నిజ్జంగా

admin
Published by Admin — May 05, 2025 in Movies
News Image

2023లో పవర్ స్టార్ పవన్ తన చేతిలో ఉన్న మూడు చిత్రాలను పెండింగ్‌లో పెట్టేసి.. రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. ఎన్నికల మీద దృష్టిసారించాడు. ఎన్నికలు అయ్యాయి. ఆయన భాగస్వామి అయిన కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. అనేక బాధ్యతలు మీద పడడంతో వెంటనే మళ్లీ సినిమాలు మొదలుపెట్టలేని స్థితికి చేరుకున్నాడు. కొన్ని నెలల కిందట తిరిగి ‘హరిహర వీరమల్లు’ చిత్రీకరణకు హాజరైనప్పటికీ.. అది కొన్ని రోజులే మళ్లీ బ్రేక్ వచ్చింది.

ఇక మిగతా రెండు సినిమాల జోలికి అస్సలు వెళ్లే పరిస్థితే కనిపించలేదు. దీంతో వీటి రిలీజ్ సంగతి డోలాయమానంలో పడింది. షూట్ చివరి దశలో ఉన్న ‘హరిహర వీరమల్లు’కైనా డేట్లు ఇచ్చి దాన్ని పూర్తి చేస్తే.. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఆ చిత్రమైనా రిలీజవుతుందని చూస్తే అదీ జరగలేదు. పవన్ షూటింగ్‌కు వస్తున్నాడని వార్తలు రావడమే తప్ప.. అది జరగలేదు.

ఈ మధ్య పవన్ అనారోగ్యం గురించి వార్తలు జోరందుకోవడంతో ఇక ఇప్పట్లో ఈ సినిమా పూర్తి కాదేమో అన్న సందేహాలు కలిగాయి. కానీ ఇప్పుడు ఎట్టకేలకు పవన్ ఈ సినిమా చిత్రీకరణకు హాజరవుతున్నట్లు సమాచారం. ఆయన సెట్లోకి అడుగు పెట్టిన విషయాన్ని చిత్ర బృందం ధ్రువీకరించింది. పవన్ మీద కొన్ని రోజులు మాత్రమే చిత్రీకరణ జరపాల్సి ఉందట. అంతా పక్కాగా సిద్ధం చేసుకుని బ్యాలెన్స్ షూట్ పూర్తి చేసి రెండు మూడు రోజుల్లోనే గుమ్మడికాయః కొట్టేయబోతోందట చిత్ర బృందం.

ఆ తంతు ముగియగానే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేస్తారట. మే నెలాఖరులో లేక జూన్ ప్రథమార్ధంలో సినిమాను రిలీజ్ చేసే అవకాశాలున్నాయంటున్నారు. పవన్ షూట్‌కు రావడం కన్ఫమ్ అవ్వగానే నిర్మాత ఏఎం రత్నం బిజినెస్ చర్చలు కూడా మొదలుపెట్టాడు. కాబట్టి ‘వీరమల్లు’ ఆగమనాన్ని ఈసారి ఎవ్వరూ ఆపలేరన్నట్లే.

Tags
hariharaveeramallu shooting finished hero pawan kalyan pawan's movie release date
Recent Comments
Leave a Comment

Related News