బాలీవుడ్ నటుడి ఆవేదన.. మండిపడ్డ సాయిరాజేష్

admin
Published by Admin — May 05, 2025 in Movies
News Image

బాలీవుడ్ లెజెండరీ నటుడు.. కొన్నేళ్ల కిందటే అరుదైన క్యాన్సర్‌తో చనిపోయిన ఇర్ఫాన్ ఖాన్ వారసత్వాన్ని కొనసాగిస్తూ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన యువ నటుడు బాబిల్ ఖాన్ తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాసేపటికే డెలీట్ చేసిన ఈ వీడియోలో బాలీవుడ్ చాలా రూడ్‌గా ఉంటుందంటూ కామెంట్ చేశాడు బాబిల్. షనాయా కపూర్, అనన్య పాండే, అర్జున్ కపూర్, సిద్దాంత్ చతుర్వేది, రాఘవ్ జుయల్, ఆదర్శ్ గౌరవ్, అర్జిత్ సింగ్.. ఇలా చాలామంది పేర్లు ప్రస్తావించాడు.

బాలీవుడ్ మొత్తం పాడైపోయిందన్నట్లుగా మాట్లాడాడు బాబిల్. ఈ వీడియో తీవ్ర వివాదాస్పదం కాగా.. కాసేపటికే దాన్ని డెలీట్ చేశాడు బాబిల్. తర్వాత బాబిల్ పీఆర్ టీం దీనిపై వివరణ ఇచ్చింది. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారంది. బాబిల్ ప్రస్తావించిన అందరి నుంచి అతను స్ఫూర్తి పొందాడని పేర్కొంది. బాబిల్ సైతం తాను పేర్కొన్న వ్యక్తులను విమర్శించలేదని.. సపోర్ట్ చేశానని పేర్కొన్నాడు.

ఐతే బాబిల్ వీడియో మీద విమర్శలు తప్పట్లేదు. దీనిపై తెలుగు దర్శకుడు సాయి రాజేష్ సైతం స్పందించాడు. తన బ్లాక్ బస్టర్ మూవీ ‘బేబీ’ని హిందీలో బాబిల్‌తోనే రీమేక్ చేయాలని ప్రయత్నించాడు సాయిరాజేష్. కానీ తర్వాత అతణ్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాబిల్ ఈ వీడియో చేశాడా అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టాలో బాబిల్ మీద ఘాటుగా స్పందించాడు.

‘‘మేం పిచ్చోళ్లలా కనిపిస్తున్నామా? మీరు ఏం చెప్పినా మాట్లాడకుండా కూర్చుంటామని అనుకుంటున్నారా? సింపతీ వీడియోలో అతను ప్రస్తావించిన వారు మాత్రమే మంచి వాళ్లు అయితే.. ఇంతకాలం నిన్ను సపోర్ట్ చేసిన మేమంతా పిచ్చోళ్లమా? వాళ్లను పొగడాలి, గౌరవం ఇవ్వాలి అంటే ఇచ్చుకో. కానీ నీ కోసం నిల్చున్న మా అందరినీ లైట్ తీసుకోవడం కరెక్ట్ కాదు. గంట ముందు వరకు నీకు సపోర్ట్ చేయాలనుకున్నా. కానీ ఇప్పుడు ఇంతటితో ఆగిపోవడం మంచిదనిపిస్తోంది. ఈ సింపతీ ఆటలు ఇక నడవవు. నువ్వు క్షమాపణలు చెప్పాల్సిందే’’ అని పోస్ట్ పెట్టాడు.

దీనిపై బాబిల్ స్పందిస్తూ.. ‘‘నా మనసు ముక్కలు చేశావు. నీ కోసం చేయాల్సిందంతా చేశాను. రెండేళ్ల జీవితాన్ని ధారబోశాను. ఒళ్లు హూనం చేసుకుని పాత్రకు తగ్గట్లుగా మలుచుకున్నా. మురికిగుంటలో పొర్లాను. నీ కోసం చేయి కోసుకున్నాను’’ అని కామెంట్ చేశాడు. తర్వాత దీన్ని కూడా డెలీట్ చేశాడు.

 
 
 

 

 
Tags
director sai rajesh hero babil khan insta post post deleted verbal war
Recent Comments
Leave a Comment

Related News