తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా దివాకర్ రెడ్డి!

admin
Published by Admin — May 11, 2025 in Politics, Andhra, Nri
News Image

ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు చాలా రోజులుగా తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. కూటమిలోని మూడు పార్టీల నుంచి భారీగా ఆశావహులు ఉండడంతో ఏ పార్టీకి ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి అన్న విషయంపై చంద్రబాబు మల్లగుల్లాలు పడ్డారు. అన్ని పార్టీలలోని నేతలకు న్యాయం జరిగేలా తుది జాబితాను రూపొందించి ఎట్టకేలకు నేడు విడుదల చేశారు.

ఈ జాబితాలో టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన పలువురికి కీలక పదవులు దక్కాయి. టీడీపీ గెలుపు కోసం కృషి చేసిన కొందరు ఎన్నారైలకు కూడా చంద్రబాబు తగిన గుర్తింపునిచ్చారు. అమరావతి జేఏసీ తరఫున కొందరికి పదవులు ఇచ్చారు. తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమితులైన డాలర్ దివాకర్ కు నమస్తే ఆంధ్ర తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

నామినేటెడ్ పదవుల జాబితా:

1. ఆంధ్రప్రదేశ్ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ బోర్డు | డా. జెడ్. శివ ప్రసాద్ | నెల్లూరు సిటీ | టీడీపీ

2. ఆంధ్రప్రదేశ్ విద్యా మరియు సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ (APEWIDC) | ఎస్. రాజశేఖర్ | కుప్పం | టీడీపీ

3. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ & బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ | సుగుణమ్మ | తిరుపతి | టీడీపీ

4. ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు | వెంకట శివుడు యాదవ్ | గుంతకల్ | టీడీపీ

5. ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు | వలవల బాబ్జీ | తాడేపల్లిగూడెం | టీడీపీ

6. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ (APSSDC) | బురుగుపల్లి శేషారావు | నిడదవోలు | టీడీపీ

7. ఆంధ్రప్రదేశ్ మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ | పితల సుజాత | భీమవరం | టీడీపీ

8. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ | దివాకర్ రెడ్డి | తిరుపతి | టీడీపీ

9. ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (EUDA) | వాణి వెంకట శివ ప్రసాద్ పెన్నుబోయిన | ఏలూరు టీడీపీ

10. ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్టీ సొసైటీ (APNRTS) | డా. రవి వేమూరు | తెనాలి | టీడీపీ

11. ఆంధ్రప్రదేశ్ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ | మలేపాటి సుబ్బా నాయుడు | కావలి | టీడీపీ

12. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ | కె.ఎస్. జవహర్ | కొవ్వూరు (ఎస్సీ) | టీడీపీ

13. ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య | పెదిరాజు కొల్లు | నరసాపురం | టీడీపీ

14. ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ | పేరేపి ఈశ్వర్ | విజయవాడ ఈస్ట్ | టీడీపీ

15. ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ | మల్లెల ఈశ్వరరావు | గుంటూరు వెస్ట్ | టీడీపీ

16. ఆంధ్రప్రదేశ్ టైలర్ అభివృద్ధి సహకార సమాఖ్య | ఆకాసపు స్వామి | తాడేపల్లిగూడెం | టీడీపీ

17. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ (APSIDC) | లీలకృష్ణ | మండపేట | జనసేన పార్టీ

18. ఆంధ్రప్రదేశ్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ | రియాజ్ | ఒంగోలు | జనసేన పార్టీ

19. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ | డా. పసుపులేటి హరి ప్రసాద్ | తిరుపతి | జనసేన పార్టీ

20. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ | సోల్ల బోజ్జి రెడ్డి | రంపచోడవరం | భారతీయ జనతా పార్టీ

21. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ | డా. రాయపాటి శైలజా | అమరావతి జేఏసి

22. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ | ఆలపాటి సురేష్ | అమరావతి జేఏసి

Tags
cm chandrababu dollar diwakar as TUDA Chairman nominated posts in ap
Recent Comments
Leave a Comment

Related News