మృణాల్‌తో రెండో పెళ్లి.. నిజం చెప్పేసిన సుమంత్‌..!

admin
Published by Admin — May 11, 2025 in Politics
News Image

అక్కినేని కాంపౌండ్ నుంచి సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన సుమంత్‌ స్టార్ హీరో అనే ముద్ర వేయించుకోలేనప్పటికీ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. త్వరలోనే `అనగనగా` అనే మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమా మే 15న నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ప్రొఫెషన్ గురించి పక్కన పెడితే.. సుమంత్ పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.

ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో సుమంత్ ప్రేమలో పడ్డాడని.. త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నార‌న్న‌దే ఆ వార్త సారాంశం. ఇటీవల సుమంత్, మృణాల్ క్లోజ్ గా ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫోటోను చూసి కొందరు తమకు ఇష్టం వచ్చిన కథనాలను అల్లారు. `సీతా రామం` సినిమాలో సుమంత్‌, మృణాల్‌ స్క్రీన్ షేర్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ సినిమా సమయంలోనే ఇరువురి మధ్య ప్రేమ చిగురించిందని.. ఇప్పుడు వారి బంధం పెళ్లి వరకు వెళ్లబోతుందంటూ వార్తలు సృష్టించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమంత్‌.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. మృణాలతో తన పెళ్లి అంటూ వ‌స్తున్న‌ వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. నెట్టింట వైర‌ల్ అవుతున్న ఫోటో సీతా రామం సినిమా స‌మ‌యంలో దిగిందే అని సుమంత్ తెలిపారు. మృణాల్ తో తాను ఎటువంటి రిలేషన్ లో లేన‌ని.. అస‌లు త‌న‌కు మ‌ళ్లీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పారు. సింగిల్ గా ఉండ‌ట‌మే త‌న‌కు ఇష్ట‌మ‌న్నారు. తానెప్పుడూ ఒంట‌రిత‌నాన్ని ఫీల్ అవ్వ‌లేద‌ని.. రోజుకు ఐదు గంటల పాటు సినిమాలు లేదా ఓటీటీలో బిజీగా ఉంటానని, ఆ తర్వాత జిమ్ చేయడంతో పాటు స్పోర్ట్స్ ఆడతానని సుమంత్ చెప్పుకొచ్చారు. దాంతో సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న పుకార్ల‌కు పులిస్టాప్ ప‌డిన‌ట్లైంది.

Tags
Latest news Marriage Rumours Mrunal Thakur second marriage
Recent Comments
Leave a Comment

Related News