అలా మాత్రం నా పిల్ల‌ల‌ను పెంచ‌ను: ఇలియానా

admin
Published by Admin — May 09, 2025 in Politics
News Image

ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పిన గోవా బ్యూటీ ఇలియానా ప్ర‌స్తుతం ఫ్యామిలీ లైఫ్‌లో బిజీ బిజీగా మారింది. మైఖేల్ డోలన్ అనే వ్య‌క్తిని గ‌ప్‌చుప్‌గా పెళ్లాడిన ఇలియానా.. 2023లో పండండి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. 2024లో ఇలియానా మ‌రోసారి ప్రెగ్నెంట్ అయింది. త్వ‌ర‌లోనే మైఖేల్‌, ఇలియానా దంప‌తులు త‌మ రెండో బిడ్డ‌కు వెల్క‌మ్ చెప్ప‌బోతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అభిమానుల‌తో చిట్ చాట్ చేసిన ఇలియానా.. పిల్ల‌ల పెంప‌కం గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంది.

ఒక ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్న ఇలియానాకు `పిల్లలు అత్యుత్త‌మంగా పెరగాలంటే తల్లిగా ఏం చేయాలి? నిజమైన ప్రేమంటే ఏంటి?` అనే ప్ర‌శ్న ఎదురైంది. అందుకు ఇలియానా.. `ఇత‌రుల ప్రేమను సంపాదించుకోవాలి అనే భావనతో మాత్రం నా పిల్లల్ని పెంచను. ఎందుకంటే, అదో చెత్త అనుభూతి. ప్రేమ అనేది సంపాదించుకుంటే వ‌చ్చే వ‌స్తువు కాదు. ప్రేమ అనేది స్వతహాగా, స్వచ్ఛంగా, స‌హ‌జంగా ఉండాలి` అని చెప్పుకొచ్చింది.

ఇక త‌న పిల్లలను దయగల వ్యక్తులుగా, ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా జీవించేలా పెంచాల‌నుకుంటున్నాన‌ని ఇలియానా తెలిపింది. అలాగే పిల్లలు తమ తల్లిదండ్రులచే ఎంతగా ప్రేమించబడుతున్నారో వారికి తెలిసేలా చేయడానికి కూడా నా వంతు కృషి చేస్తాన‌ని పేర్కొంది. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇలియానా గ‌త ఏడాది బాలీవుడ్ లో `దో ఔర్ దో ప్యార్` అనే మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఆ త‌ర్వాత ఆమె నుంచి మ‌రో సినిమా రాలేదు. కొత్త ప్రాజెక్ట్‌ల‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్లూ లేవు. ప్ర‌స్తుతం ఇలియానా ప్రొఫెష‌న‌ల్ లైఫ్ క‌న్నా ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కే అధిక ప్ర‌ధాన్య‌త ఇస్తూ ముందుకు సాగుతోంది.

Tags
bollywood ileana ileana d'cruz parenting Telugu News Tollywood
Recent Comments
Leave a Comment

Related News