కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబినేషన్‌లో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన యాక్షన్ డ్రామా `కుబేర` విడుదలకు సిద్ధమయ్యింది. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. కోలీవుడ్ స్టార్ ధనుష్ మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేస్తున్నప్పటికీ.. తమిళంలో కన్నా తెలుగులోనే కుబేర ఎక్కువ బిజినెస్ చేసింది.
ఏపీ మరియు తెలంగాణలో ఈ సినిమాకు రూ. 33 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా క్లీన్ హిట్ కావాలంటే రూ. 34 కోట్ల రేంజ్ లో షేర్‌ను రాబట్టాల్సి ఉంటుంది. అలాగే తమిళనాడులో కుబేర థియేట్రికల్ రైట్స్ రూ. 18 కోట్లకు అమ్ముడుపోయాయి. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ. 5.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 8.50 కోట్ల బిజినెస్ జరిగింది.
వరల్డ్ వైడ్‌గా కుబేర టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 65 కోట్లు. ఈ లెక్కన రూ. 66 కోట్ల షేర్ కలెక్షన్స్‌ను వసూల్ చేస్తేనే కుబేర బాక్సాఫీస్ వద్ద సేఫ్ అవుతుంది. టాక్ పాజిటివ్‌గా వస్తే ఈ టార్గెట్‌ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదనే చెప్పాలి. కాగా, కుబేరలో రష్మిక, జిమ్ సర్భ్, సునయన తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మితమైన కుబేర 3 గంటల ఒక్క నిమిషం నిడివితో రేపు థియేటర్స్ లో సందడి చేయబోతుంది.