డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి తెరకెక్కించిన తాజా చిత్రం `కుబేర`. తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేయగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, బాలీవుడ్ స్టార్ యాక్టర్ జిమ్ సర్భ్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. జూన్ 20న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయిన కుబేర చిత్రానికి మెజారిటీ ఆడియెన్స్ నుండి పాజిటివ్ టాక్ లభించింది.
స్టోరీ, నటీనటుల యాక్టింగ్, దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. అయితే అక్కడక్కడ సాగదీత సన్నివేశాలు ప్రేక్షకులకు కొంత విసుగు పుట్టించాయి. మొత్తంగా సినిమా మనుషుల్ని కదిలిస్తుందని ఎక్కువ శాతం మంది చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. కుబేర స్టార్స్ రెమ్యునరేషన్ లెక్కలు తెరపైకి వచ్చాయి. ఈ సినిమా మొత్తం బడ్జెట్ రూ. 120 కోట్లు.
మెయిన్ హీరోగా నటించిన ధనుష్ రూ. 30 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారట. అలాగే మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన నాగార్జున రూ. 14 కోట్లు రెమ్యునరేషన్ ఛార్జ్ చేశారని అంటున్నారు. హీరోయిన్ రష్మిక కుబేర సినిమాకు గాను రూ. 4 కోట్లు పారితోషికం పుచ్చుకుందని.. కెప్టెన్ ఆఫ్ ది షిప్ శేఖర్ కమ్ముల రూ. 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఇక తన నేపథ్య సంగీతంతో సినిమాకు ప్రాణం పోసిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ రెమ్యునరేషన్ రూ. 3 కోట్లు అని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.