పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌

admin
Published by Admin — June 11, 2025 in Politics, Andhra
News Image

అమ‌రావ‌తి రాజ‌ధానిలో `ఆ త‌ర‌హా` మ‌హిళ‌లు ఉంటారంటూ.. సాక్షి మీడియా చ‌ర్చ‌లో తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన వ్యాఖ్యాత కృష్ణంరాజు, ఈ స‌మ‌యంలో యాంక‌ర్ పాత్ర పోషించిన కొమ్మినేని శ్రీనివాస్‌పై మ‌హిళ‌లు తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. అంతేకాదు.. వారు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. తమను అసభ్యపదజాలంతో..‌ దూషించిన కొమ్మినేని, కృష్ణం రాజు ఫోటోలను చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు.

అంతేకాదు.. సాక్షి మీడియా కార్యాల‌యాల వ‌ద్ద కూడా అమ‌రావ‌తి మ‌హిళ‌లు ఆందోళ‌న చేశారు. కార్యాల యాల్లోకి దూసుకు వెళ్లి రాళ్లు రువ్వారు. కోడి గుడ్లు విసిరారు. అయితే.. ఘ‌ట‌న‌లు స‌హా.. ఆయా ఘ‌ట‌న‌ల్లో పాల్గొన్న‌ మహిళలపై.. వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామ‌కృష్ణారెడ్డి తీవ్ర‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. “
పిశాచాలు, రాక్షసులు కూడా ఇలా చేయవేమో…?? ఇదంతా పూర్తి సమన్వయంతో పనిచేసే అర్గనైజ్డ్ సంకర తెగ. కమ్ముకొని చేసిన పని“ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

తాజాగాఈ వ్యాఖ్య‌ల‌పైనా అమ‌రావతి మ‌హిళ‌లు స‌హా.. ఏపీ మ‌హిళా క‌మిష‌న్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విజ‌య‌వాడ‌, గుంటూరు, తాడేప‌ల్లిలోని పోలీసు స్టేష‌న్ల‌లోనూ ఫిర్యాదు చేయ‌నున్న‌ట్టు క‌మిష‌న్ పేర్కొంది. ఇప్ప‌టికే ఇంత‌గా మ‌హిళ‌ల నుంచి ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతున్నా.. వైసీపీ నాయ‌కుల తీరు మాత్రం మార‌లే ద‌ని క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ రాయ‌పాటి శైలజ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వీరిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. అంతేకాదు.. తాము కూడా నోటీసులు ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపారు.

Tags
ycp Jagan Mohan Reddy sajjala
Recent Comments
Leave a Comment

Related News

Latest News