ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీకి చెప్పి ఏపీకి తెలంగాణ నీళ్లు తరలించాలని అనుకోవద్దని, అందుకోసం ప్రాజెక్టులు కట్టడం సరికాదని రేవంత్ షాకింగ్ కామెంట్లు చేశారు. సముద్రానికి వెళ్లే నీటిని మాత్రమే ఆంధ్రా వాడుకోవాలని సూచించారు.
ప్రపంచ స్థాయి పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం డెస్టినేషన్‌గా మారుతోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పా రు. తాజాగా హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక `గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్`ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఒకప్పుడు లక్ష్యం లేకుండా రాష్ట్రం ఉండిపోయిందని పరోక్షంగా బీఆర్ ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు. అయితే.. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా అనేక మార్పుల దిశగా అడుగుల వేస్తోందన్నారు.
ఈ క్రమంలోనే ప్రపంచ స్థాయి పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారుతోందని చెప్పారు. 2035 నాటికి అంటే.. మరో పదేళ్లలో రాష్ట్రం 1 ట్రిలియన్(కోటి కోట్ల రూపాయలు) డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతుందన్నారు. ఈ దిశగానే తమ ప్రభు త్వం పనిచేస్తోందని చెప్పారు. ఈ క్రమంలో డిజిటల్ వ్యవస్థకు ప్రాధాన్యం ఇస్తున్నామని.. ప్రపంచంతోనే పోటీ పడుతున్నామని చెప్పారు.
డిజిటల్ భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం చెప్పారు. హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రం ప్రస్థావన ప్రపంచ దేశాలకు కూడా తెలిసిందన్నారు. దీని ద్వారా అనేక ప్రపంచ స్థాయి ఆవిష్కరణలకు తెలంగాణవేదిక కానుందన్నారు. ఈ సందర్భంగా గూగుల్‌తో తమ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి పోల్చుకున్నారు. గూగుల్ అంటే ఒక వినూత్న సంస్థ అని.. తమ ప్రభుత్వం కూడా ఒక వినూత్న గర్నమెంటు అని పేర్కొన్నారు. అనేక విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
తెలంగాణలో యువతకు కొవదలేదన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇక్కడి వారికినైపుణ్యాలు నేర్పిస్తే.. ప్రపంచ స్థాయికి ఎదుగుతారని చెప్పారు. ఈ క్రమంలో `స్కిల్ యూనివర్సిటీ`ని ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ యువత పోటీపడేలా ఈ యూనివర్సిటీ ప్రయత్నం చేస్తోందన్నారు. “సుస్థిరమైన ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, 2035 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తుంది“ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.