వైసీపీ అధినేత జగన్‌పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవ ర్గంలో పార్టీ నాయకుడు, మాజీ ఉప సర్పంచ్.. నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు ఉదయం 9.30 గంటలకు బయలు దేరిన జగన్.. 8 గంటలుగా.. దారి పొడవునా.. ప్రదర్శన నిర్వహిస్తూ.. ముందుకుసాగుతున్నారు. సాయంత్రం 4.30 గంటల వరకు కూడా ఆయన నాగమల్లేశ్వరరావు ఇంటికి చేరుకోలేదు. ఈ లోగా.. జగన్ కాన్వాయ్ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
ఈ రెండు ప్రమాదాలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. తాజాగా ఆయన అధికారులతో వివి ధ అంశాలపై సమీక్ష చేస్తున్న సమయంలో జగన్ కాన్వాయ్ ఢీ కొట్టిన ఘటనలు వెలుగు చూడడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచార యాత్ర చేస్తున్నారా? పరామర్శ యాత్ర చేస్తున్నారా? అని ప్రశ్నించారు. అధికారులు చూస్తూ ఊరుకున్నారా? లేక చర్యలు తీసుకున్నారా? అని నిలదీశారు. ఎవరైతే కారణమో గుర్తించి ఆయా ఘటనలపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజాస్వామ్యంలో ప్రచారం చేసుకునేందుకు ఒక సమయం ఉంటుందని.. కానీ.. లేనిపోని యాత్రల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. సత్తెనపల్లిలో మూడు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయిన ఘటనపై కూడా చంద్రబాబు సీరియస్ అయ్యారు. పోలీసులు ఏం చేస్తున్నా రని నిలదీశారు. సాదారణ ప్రజలకు ఇబ్బందులు కలుగుతుంటే.. చోద్యం చూశారా? అని నిలదీశారు. ఈ ఘటనపై తనకు వెంటనే నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.
“ఎవరో యాత్రలు చేసుకుంటే.. దానికి సాధారణ ప్రజలు ఇబ్బందులు పడాలా?“ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఆయా ఘటనలపై హోం మంత్రి అనిత కూడా రియాక్ట్ అయ్యారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాలని.. ఇద్దరు చనిపోయిన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని ఆమె చెప్పారు. బాధ్యులు ఎంతటి వారైనా కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు.